తెలంగాణ

telangana

ETV Bharat / city

Contempt of Court Case: కోర్టు ధిక్కరణ కేసులో సబ్‌ కలెక్టర్​కు జైలుశిక్ష - కోర్టు ధిక్కరణ కేసులో సబ్‌ కలెక్టర్​కు జైలుశిక్ష వార్తలు

Contempt of Court Case in AP: కోర్టు ఆదేశాలిచ్చినా బాధితులకు న్యాయం చేయకుండా నిర్లక్ష్యం వహించిన సబ్​ కలెక్టర్​పై ఏపీ హైకోర్టు చర్యలు తీసుకుంది. కోర్టు ధిక్కరణ కేసు కింద అతనికి జైలు శిక్ష, జరిమానా విధించింది. వారంలోగా ఉన్నత న్యాయస్థానం ఎదుట హాజరు కావాలని స్పష్టం చేసింది.

Contempt of Court Case
కోర్టు ధిక్కరణ కేసు

By

Published : Apr 21, 2022, 7:55 PM IST

Contempt of Court Case in AP: కోర్టు ధిక్కరణ కేసులో రాజంపేట సబ్‌ కలెక్టర్‌ ఖేతన్‌ గార్గ్‌కు, ఏపీఎండీసీ సీపీవో సుదర్శన్‌రెడ్డికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ ఏపీ హైకోర్టు తీర్పు ఇచ్చింది. పరిహారం కేసులో కోర్టు ఆదేశాలను బేఖాతారు చేసిన ఇద్దరికీ 6 నెలల జైలుశిక్ష, రూ.2 వేల చొప్పున జరిమానా విధించింది. వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండలం మంగంపేటకు చెందిన నరసమ్మ 2003లో మైనింగ్​లో భాగంగా తన ఇంటిని కోల్పోయింది. దీంతో ఆమెకు పరిహారం చెల్లించాలని గతంలో హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

అయితే.. హైకోర్టు ఆదేశాలు ఇచ్చినా.. అధికారులు మాత్రం పరిహారం చెల్లించలేదు. దీంతో ఆమె కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. వ్యాజ్యంపై పిటిషనర్​ తరఫు న్యాయవాది శ్రీనివాస్ ఇవాళ వాదనలు వినిపించారు. విచారణ అనంతరం ఇద్దరు అధికారులకు జైలుశిక్ష, జరిమానా విధిస్తూ.. వారంలోగా కోర్టు ముందు హాజరుకావాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details