ఓయూలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటనకు అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి బయలుదేరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డితో పాటు ఓయూ జేఏసీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. గాంధీభవన్ నుంచి ఓయూ జేఏసీ నేతలతో కలిసి బయలుదేరిన ఆయనను గేటు వద్దే పోలీసులు అడ్డగించారు. పోలీసులు అడ్డుకోవడంతో ఆయన ఓయూ నేతలతో కలిసి అక్కడే బైఠాయించారు. పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ పర్యటన నేపథ్యంలో ఓయూ విద్యార్థులతో ముఖాముఖికి అనుమతి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్డి, ఓయూ నేతల యత్నం.. అడ్డగించిన పోలీసులు - telangana news
ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్డి, ఓయూ నేతల యత్నాన్ని పోలీసులు భగ్నం చేశారు. గాంధీభవన్ నుంచి ఓయూ జేఏసీ నేతలతో కలిసి ప్రగతిభవన్ బయలుదేరిన ఆయనను గేటు వద్దే పోలీసులు అడ్డగించారు. దీంతో ఆయన వారితో కలిసి బైఠాయించారు.
ప్రగతిభవన్ ముట్టడికి జగ్గారెడ్డి, ఓయూ నేతల యత్నం.. అడ్డగించిన పోలీసులు