తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీలో జగనన్న విద్యాదీవెన మొదటి విడత ప్రారంభం - CM Jagan to launch Jagananna Vidya Deevena news

జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించనున్నారు. 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671.45 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది.

AP CM, AP CM Jagan, Jagannanna Vidyadivena
ఏపీ సీఎం, ఏపీ సీఎం జగన్, జగనన్న విద్యాదీవెన

By

Published : Apr 19, 2021, 10:02 AM IST

జగనన్న విద్యాదీవెన మొదటి విడత కార్యక్రమాన్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి ఇవాళ ప్రారంభించనున్నారు. తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయం నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అర్హత ఉన్న ప్రతీ విద్యార్థికి నాలుగు ధఫాల్లో పూర్తి ఫీజు రియంబర్స్‌మెంట్‌ ప్రభుత్వం చెల్లిస్తోంది. ఇకపై ఏ త్రైమాసికానికి... ఆ త్రైమాసికంలోనే ఆ పిల్లల తల్లుల ఖాతాల్లో జమ చేయనుంది. 2020-21 విద్యా సంవత్సరానికి మొదటి విడతగా నేడు 10లక్షల 88వేల 439 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో నేరుగా 671.45 కోట్లు ప్రభుత్వం జమ చేయనుంది.

జగనన్న విద్యాదీవెన మొదటి విడత ఏప్రిల్‌ 19, రెండో విడత జులై, మూడో విడత డిసెంబర్, నాలుగో విడత ఫిబ్రవరి 2022లో ప్రభుత్వం విడుదల చేయనుంది. జగనన్న వసతిదీవెన కింద రెండు విడతల్లో భోజనం, వసతి, రవాణా సౌకర్యాలకు ఏటా 20,000 వరకు లబ్ధి చేకూర్చుతుంది. మొదటి విడత ఏప్రిల్‌ 28, రెండో విడత డిసెంబర్​లో నిధులు చెల్లిస్తారు. ఈ ఏడాది మొదటి విడతగా 671.45 కోట్లు నేడు చెల్లించడం ద్వారా... 10 లక్షల 88వేల 439 మంది విద్యార్ధులకు లబ్ధి చేకూరనుంది.

ABOUT THE AUTHOR

...view details