తెలంగాణ

telangana

ETV Bharat / city

Ap News : 'జగనన్న విద్యా దీవెన'.. రెండో విడత నిధుల విడుదల - జగనన్న విద్యా దీవెన తాజా వార్తలు

జగనన్న విద్యా దీవెన పథకంలో రెండో విడత మొత్తాన్ని ఏపీ సీఎం జగన్ ఇవాళ విడుదల చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి జగన్‌ కంప్యూటర్‌ మీట నొక్కి 10.97 లక్షల మంది విద్యార్థులకు రూ.693.81 కోట్ల బోధన రుసుముల్ని విడుదల చేస్తారు. ఇవి విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జమ అవుతాయి.

జగనన్న విద్యా దీవెన
జగనన్న విద్యా దీవెన

By

Published : Jul 29, 2021, 10:56 AM IST

జగనన్న విద్యా దీవెన పధకం కింద ఈ ఏడాది రెండో విడతగా 10.97 లక్షల మంది విద్యార్ధులకు 693.81 కోట్ల రూపాయలను ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బటన్ నొక్కి వారి తల్లుల ఖాతాలకు జమ చేయనున్నారు. జగనన్న విద్యా దీవెన పథకం ద్వారా ఐటీఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్, మెడిసిన్‌ తదితర కోర్సులు చదివే పేద విద్యార్ధులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని చెల్లించేందుకు వీలుగా ప్రతీ త్రైమాసికానికి ఒక మారు విద్యార్ధుల తల్లుల ఖాతాల్లో నేరుగా ఈ మొత్తాలను జమ చేస్తున్నారు.

వసతి దీవెన పథకం ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్ధులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్‌ విద్యార్ధులకు రూ. 15 వేలు, డిగ్రీ ఆపై కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున వసతి, భోజన ఖర్చుల కోసం తల్లుల ఖాతాల్లోకి నేరుగా.. ప్రభుత్వం జమ చేస్తోంది. విద్యారంగంపై ఇప్పటి వరకు 26,677.82 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. నాడు – నేడు పథకంలో భాగంగా అంగన్ వాడీలను ప్రాథమిక పాఠశాలలుగా మార్చనట్లు వెల్లడించింది. పౌష్టికాహారం కోసం వైఎస్సార్‌ సంపూర్ణ పోషణ ద్వారా ఏటా మరో 1,800 కోట్ల వ్యయం చేయనున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఏప్రిల్‌లో మొదటి విడతగా 671.45 కోట్ల రూపాయలు చెల్లించామంది.

ABOUT THE AUTHOR

...view details