తెలంగాణ

telangana

ETV Bharat / city

jagananna thodu: నేడే 'జగనన్న తోడు' వడ్డీ జమ - జగనన్న తోడు

జగనన్న తోడు(jagananna thodu scheme)" పథకం కింద రుణాలు పొంది, సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఇవాళ వడ్డీని జమ చేయనుంది. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి ఏపీ సీఎం జగన్​.. బటన్‌ నొక్కి జమ చేయనున్నారు.

jagananna thodu
jagananna thodu

By

Published : Oct 20, 2021, 12:10 PM IST

"జగనన్న తోడు(jagananna thodu scheme)" పథకం కింద రుణాలు పొంది.... సకాలంలో చెల్లించిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో ఏపీ ప్రభుత్వం ఇవాళ వడ్డీని జమ చేయనుంది. 2020 నవంబరు నుంచి 2021 సెప్టెంబరు 30 వరకు ఈ పథకం కింద రుణాలు పొంది సకాలంలో చెల్లించిన 4 లక్షల 50 వేల మంది ఖాతాల్లో 16 కోట్ల 36 లక్షల వడ్డీని బదిలీ చేయనున్నారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి సీఎం జగన్ బటన్‌ నొక్కి ఈ మొత్తాన్ని జమ చేస్తారు.

ఇంకా ఏడాది రుణ కాల పరిమితి ముగియని లబ్ధిదారులకు రుణ చెల్లింపులు పూర్తి కాగానే వారు చెల్లించిన వడ్డీని నేరుగా ఖాతాల్లోకి జమ చేస్తామని ప్రభుత్వం వెల్లడించింది. రుణం తీర్చిన వారు తిరిగి బ్యాంకుల నుంచి 10వేల రూపాయలు రుణంగా పొందవచ్చని సూచించింది.
ఇదీ చూడండి:Tdp Leaders Arrest News: ఏపీలో తెదేపా నేతల గృహనిర్బంధాలు.. ముందస్తు అరెస్టులు

ABOUT THE AUTHOR

...view details