తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagananna Smart Township: నేడు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్​ వెబ్‌సైట్‌ ప్రారంభం - తెలంగాణ వార్తలు

Jagananna smart town ship: మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ నేడు ప్రారంభించనున్నారు. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలు ఈ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది.

Jagananna Smart Township, ap cm jagan news
నేడు జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్​ వెబ్‌సైట్‌ ప్రారంభం

By

Published : Jan 11, 2022, 11:10 AM IST

Jagananna smart town ship: ఆంధ్రప్రదేశ్​లో మధ్య తరగతి ప్రజల సొంతింటి కలను నెరవేర్చేందుకు ఉద్దేశించిన జగనన్న స్మార్ట్‌ టౌన్‌షిప్స్‌ పథకానికి సంబంధించిన వెబ్‌సైట్‌ను ముఖ్యమంత్రి జగన్‌ ఈరోజు ప్రారంభించనున్నారు. మొదటి దశలో అనంతపురం జిల్లా ధర్మవరం, గుంటూరు జిల్లా మంగళగిరి మండల పరిధిలోని నవులూరు, కడప జిల్లా రాయచోటి, ప్రకాశం జిల్లా కందుకూరు, నెల్లూరు జిల్లా కావలి, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు లేఅవుట్లలో అమలు చేస్తారు. నేటి నుంచి http://migapdtcp.ap.gpv.in వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు.

కంప్యూటరైజ్డ్‌ లాటరీ ద్వారా అత్యంత పారదర్శకంగా ప్లాట్లను కేటాయిస్తారు. త్వరలో ఏపీవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు విస్తరించనున్నారు. రూ.18 లక్షల వరకు వార్షికాదాయం ఉన్న అర్హులైన కుటుంబాలకు సరసమైన ధరలకు నివాస స్థలాలు కేటాయిస్తారు. ఏడాది కాలంలో వీటిని అభివృద్ధి చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి లేఅవుట్‌లో 10% పాట్లు, 20% రిబేటుతో కేటాయిస్తారు. నిర్దేశిత మొత్తాన్ని ఏడాది కాలంలో నాలుగు వాయిదాల్లో చెల్లించే వెసులుబాటు ఉంటుంది. ఏకమొత్తంగా చెల్లించే వారికి 5% మేరకు రాయితీ కల్పిస్తారు. అన్ని రకాల వసతులతో టౌన్‌షిప్‌లను అభివృద్ధి చేస్తారు.

ఇదీ చదవండి:Minister Jagadish Reddy Tested Corona Positive : మంత్రి జగదీశ్‌రెడ్డికి కరోనా పాజిటివ్

ABOUT THE AUTHOR

...view details