ఏపీలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి రంగం ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వ శాఖలవారీగా ఖాళీల నివేదికను ప్రభుత్వం సిద్ధం చేసింది. ఏపీపీఎస్సీ ద్వారా ఉద్యోగ ఖాళీల భర్తీ చేయనుంది.
job calender: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే ఉద్యోగ క్యాలెండర్ విడుదల - ap job calender news
ఏపీలో నిరుద్యోగులకు శుభవార్త. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శాఖల వారీగా ఖాళీల నివేదికను ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. కాగా రేపు(శుక్రవారం) సీఎం జగన్ ఉద్యోగ క్యాలెండర్ను విడుదల చేయనున్నారు.
![job calender: నిరుద్యోగులకు శుభవార్త.. రేపే ఉద్యోగ క్యాలెండర్ విడుదల Jobs Calander](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12172407-826-12172407-1623950179498.jpg)
Jobs Calander
దీనికి సంబంధించిన ఉద్యోగ క్యాలెండర్ను శుక్రవారం ఏపీ సీఎం జగన్ విడుదల చేయనున్నారు. ఆర్థికశాఖ ఆమోదంతో ఏపీపీఎస్సీ విడతలవారీగా పరీక్షలు నిర్వహించనుంది. ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను ఓ క్రమ పద్ధతిలో భర్తీ చేసేందుకు ప్రత్యేకంగా క్యాలెండర్ రూపొందించారు.
ఇదీ చదవండి:మెగా సోలార్ పవర్ ప్రాజెక్టు టెండర్లు రద్దు చేసిన హైకోర్టు