జగన్ అక్రమాస్తుల కేసులపై సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. జగన్ కేసులో ఎన్‌బీడబ్ల్యూ ఉపసంహరించాలని నిమ్మగడ్డ ప్రసాద్ కోరారు. ఈ మేరకు సీబీఐ, ఈడీ కోర్టు ఎన్‌బీడబ్ల్యూను ఉపసంహరించింది. ఈడీ కేసులు ముందుగా విచారణ జరపాలనే అంశంపై వాదనలు కొనసాగాయి. దీనిపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్‌రెడ్డి, శ్రీనివాస్ అభ్యంతరం తెలిపారు.
తొలుత ఈడీ కేసుల విచారణ వద్దు.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు - జగన్ పై సీబీఐ కేసుల వార్తలు
జగన్ అక్రమాస్తుల కేసులో సీబీఐ, ఈడీ కోర్టులో విచారణ సాగింది. ఈడీ కేసులు ముందుగానే విచారణ జరపాలనే అంశంపై విజయసాయిరెడ్డి, అయోధ్యరామిరెడ్డి, ప్రతాప్ రెడ్డి అభ్యంతరం తెలిపారు. ముందు సీబీఐ కేసులపై విచారణ జరపాలని వారి తరఫు న్యాయవాదులు వాదనలు వినిపించారు.
![తొలుత ఈడీ కేసుల విచారణ వద్దు.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు jagan-disproportionate-assets-cases-adjourned-to-the-20th-november](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9572464-677-9572464-1605620353508.jpg)
తొలుత ఈడీ కేసులు విచారణ వద్దు.. జగన్ అక్రమాస్తుల కేసులో వాదనలు
తొలుత ఈడీ కేసులు విచారణ చేయవద్దని నిందితుల తరఫు న్యాయవాదులు వాదించారు. జగన్ కేసుల్లో ఈడీ కేసులపై తదుపరి విచారణ ఈనెల 20కి వాయిదా వేయగా... సీబీఐ ఛార్జ్‌షీట్లపై ఈ నెల 19న విచారణ జరపనుంది.
ఇవీ చూడండి: 'దుబ్బాకతోనే తెరాస పతనం.. గ్రేటర్‌లోనూ అదే పునరావృతం'