సీఎం జగన్ దిగ్భ్రాంతి:ఏపీలోనిచిత్తూరు జిల్లాలో జరిగిన భాకరాపేట బస్సు ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి జగన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై సీఎం అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మరణించిన వారి కుటుంబ సభ్యులకు 2 లక్షల రూపాయల చొప్పున పరిహారం ఇవ్వాలని ఆదేశించారు. గాయపడిన వారికి 50 వేల రూపాయలు చెల్లించాలని సూచించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి మెరుగైన వైద్యసేవలు అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
గవర్నర్ ప్రగాఢ సానుభూతి..: చిత్తూరు జిల్లా భాకరాపేట వద్ద ప్రమాదంలో 8 మంది మృతి చెందడంపై గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని యంత్రాంగాన్ని ఆదేశించారు. రహదారి భద్రత విషయంలో ప్రయాణికులు, చోదకులు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు.