ఏపీ సీఎం జగన్ అక్రమాస్తుల కేసు(ys jagan ed case)ల కోసం ప్రత్యేక న్యాయవాది(ys jagan case lawyer)ని నియమించే ప్రతిపాదన ఉందని కోర్టుకు సీబీఐ తెలిపింది. ప్రత్యేక న్యాయవాది ప్రతిపాదన దిల్లీలోని ప్రధాన కార్యాలయంలో ఉందని సీబీఐ కోర్టుకు.. సీబీఐ పబ్లిక్ ప్రాసిక్యూటర్ తెలిపారు. రాంకీ ఫార్మా కేసులో వాదనలు వినిపించేందుకు గడువు కావాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఇందూ టెక్ జోన్ దర్యాప్తు స్థితి తెలపాలని.. ఆ తర్వాతే తన డిశ్చార్జ్ పిటిషన్‌పై వాదనలు వినిపిస్తానన్న సీఎం జగన్ మెమోపై సీబీఐ స్పందించింది. ఇందూ టెక్ జోన్లో దర్యాప్తు పూర్తయిందని.. మరో ఛార్జ్‌షీట్ వేసే ఆలోచన లేదని సీబీఐ స్పష్టం చేసింది. సీబీఐ మెమోను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు.. అభియోగాల నమోదుపై వాదనలకు సిద్ధం కావాలని నిందితుల తరఫు న్యాయవాదులను ఆదేశించింది.
విజయసాయిరెడ్డి మెమో దాఖలు..
వాన్ పిక్ కేసులో దర్యాప్తు స్థితి తెలపాలని విజయసాయిరెడ్డి మెమో దాఖలు చేశారు. అవసరమైతే అదనపు పత్రాలు, అనుబంధ ఛార్జ్ షీట్ దాఖలు చేస్తామని సీబీఐ పేర్కొన్నందున.. దర్యాప్తు స్థితి తెలపాలని కోరారు. వాన్ పిక్ కేసులో దర్యాప్తు స్థితి ఈనెల 15న తెలపాలని సీబీఐని కోర్టు ఆదేశిచింది. జగన్, విజయసాయిరెడ్డి డిశ్చార్జ్ పిటిషన్లపై కౌంటర్ల దాఖలుకు సీబీఐ మరోసారి గడువు కోరింది. సబితా ఇంద్రారెడ్డి తదితరుల డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ వాయిదా పడింది.