తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై నేడు విచారణ - AP News

అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామ వేసిన పిటిషన్​పై ఇవాళ నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది. దీనిపై నేడు విచారణ జరగనుంది.

ap cm jagan bail case
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్​పై నేడు విచారణ

By

Published : May 26, 2021, 4:52 AM IST

అక్రమాస్తుల కేసులో ఏపీ ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని కోరుతూ.. ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్​పై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ జరగనుంది. షరతులు ఉల్లంఘించినందున.. జగన్ బెయిల్ రద్దు చేయాలని పిటిషన్​లో రఘురామకృష్ణరాజు కోరారు. పిటిషన్​ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. కౌంటర్లు దాఖలు చేయాలని జగన్, సీబీఐని గతంలో ఆదేశించింది.

అయితే కౌంటర్ దాఖలుకు గడువు కావాలని ఈనెల 7న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు కోరారు. ఈనెల 17న విచారణ సందర్భంగా జగన్, సీబీఐ న్యాయవాదులు మరోసారి గడువు కోరారు. పదేపదే గడువు కోరడంపై రఘురామ తరఫు న్యాయవాదులు అభ్యంతరం వ్యక్తం చేయగా.. చివరి అవకాశం ఇస్తున్నామని తెలిపిన న్యాయస్థానం.. విచారణను ఇవాళ్టికి వాయిదా వేసింది.

ఇదీ చదవండీ...పరీక్షల రద్దు కోరుతూ సీజేఐకి విద్యార్థుల లేఖ

ABOUT THE AUTHOR

...view details