తెలంగాణ

telangana

ETV Bharat / city

జగన్ అక్రమాస్తుల కేసులపై నేడు సీబీఐ కోర్టు విచారణ - జగన్ కేసులు లెటెస్ట్ న్యూస్

ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల వ్యవహారంపై సీబీఐ నమోదు చేసిన కేసుల్లో అయిదింటిపై ఇవాళ విచారణ జరగనుంది. హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు ఈ కేసులపై విచారణ చేపట్టనుంది.

jagan-cases-come-to-hearing-on-cbi-hyderabad-court
జగన్ అక్రమాస్తుల కేసులపై నేడు సీబీఐ కోర్టు విచారణ

By

Published : Oct 27, 2020, 7:34 AM IST

ఏపీ సీఎం జగన్​ అక్రమాస్తుల వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన 11 కేసుల్లో మంగళవారం 5 కేసులపై హైదరాబాద్​లోని సీబీఐ కోర్టు విచారణ చేపట్టనుంది. సీబీఐ కోర్టు జడ్జి సెలవు, దసరా సెలవుల అనంతరం ఈ కేసుల విచారణ నేడు కొనసాగనుంది. జగతి పెట్టుబడులు, వాక్​పిక్, రాంకీ, పెన్నా సిమెంట్స్, రఘురాం/ భారతి సిమెంట్స్ కేసులను విచారించనుంది.

సీబీఐ కేసుల ఆధారంగా ఎన్​ఫోర్స్​మెంట్​ డైరెక్టరేట్(ఈడీ) నమోదు చేసిన 6 కేసుల్లో అయిదింటిపై కూడా ఈడీ ప్రత్యేక హోదా ఉన్న సీబీఐ కోర్టు విచారణ జరుపుతోంది. వీటితో పాటు ఓబుళాపురం మైనింగ్ కేసు కూడా విచారణకు రానుంది.

ఇదీ చదవండి :ఆంక్షలున్నా...ఆగని బన్నీ ఉత్సవం

ABOUT THE AUTHOR

...view details