తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagan bail cancel petition: 'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై నేడే తీర్పు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు పిటిషన్​పై నేడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. షరతులు ఉల్లంఘించినందున జగన్ బెయిల్ రద్దు చేయాలని ఎంపీ రఘురామ కృష్ణరాజు వాదన. కోర్టు విధించిన షరతుల్లో ఒక్కటి కూడా ఉల్లంఘించలేదని... కేవలం వ్యక్తిగత ప్రయోజనాల కోసం రఘురామ పిటిషన్ దాఖలు చేశారని జగన్ వాదన. విచక్షణ మేరకు, పిటిషన్​పై చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలంటూ సీబీఐ తటస్థ వైఖరిని ప్రదర్శించింది. గత నెల 30న వాదనలు ముగిసిన ఈ పిటిషన్​పై సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది. విజయసాయిరెడ్డి బెయిల్ రద్దుపై నేడు వాదనలు జరగనున్నాయి.

jagan-bail-cancel-petition-verdect
'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై తీర్పు నేడే

By

Published : Aug 25, 2021, 8:04 AM IST

'జగన్ బెయిల్ రద్దు' పిటిషన్​పై తీర్పు నేడే

ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు అంశంపై కొనసాగుతున్న ఉత్కంఠ నేడు వీడనుంది. జగన్ బెయిల్ రద్దు చేసి జైలుకు పంపించాలని కోరుతూ ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్ పై సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం నేడు తీర్పు వెల్లడించనుంది. బెయిల్ మంజూరు చేసినప్పుడు సీబీఐ కోర్టు విధించిన షరతులను జగన్ ఉల్లంఘింస్తున్నారంటూ జూన్ 4న రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. జగన్ ప్రత్యక్షంగా, పరోక్షంగా సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ ప్రధాన వాదన. సహనిందితులు, సాక్షులుగా ఉన్న కొందరు అధికారులకు కీలక పదవులు కట్టబెట్టారని వాదించారు.

పిటిషన్ వేసినందుకు ఎంపీగా ఉన్న తనపైనే ఏపీ సీఐడీ ద్వారా తప్పుడు కేసులు పెట్టి వేధించారని.. ఇక సాక్ష్యం చెప్పబోయే పరిస్థితేమిటన్నారు. మరోవైపు రఘురామ కృష్ణరాజు పిటిషన్​కు విచారణ అర్హతే లేదని.. కొట్టివేయాలని జగన్మోహన్ రెడ్డి వాదించారు. ఎంపీగా అనర్హత వేటు వేయాలని వైకాపా కోరినందుకే... తన వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాల కోసం న్యాయవ్యవస్థను వాడుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పిటిషన్ వేయగానే మీడియాలో విస్తృతంగా ప్రచారం చేసుకోవడం రఘురామ ఉద్దేశాలను స్పష్టం చేస్తోందని జగన్ వాదించారు.

సీఎంగా ఉన్నందున బెయిల్ రద్దు చేయాలంటున్నారు తప్ప.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా సరైన కారణంగా ఒక్కటి కూడా చూపలేదని జగన్ పేర్కొన్నారు. సంబంధం లేని విషయాలను ప్రస్తావించి.. సాక్షులను ప్రభావితం చేస్తారని ఊహించి.. పిటిషన్లు వేయడం తగదన్నారు. సీబీఐ మాత్రం తటస్థ వైఖరి ప్రదర్శించింది. పిటిషన్ లోని అంశాలను విచక్షణ మేరకు.. చట్టప్రకారం నిర్ణయం తీసుకోవాలని సీబీఐ కోర్టును కోరింది. జులై 30న వాదనలు ముగించిన సీబీఐ కోర్టు నేడు తీర్పు వెల్లడించనుంది.

జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయిరెడ్డి బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్​పై నేడు విచారణ జరగనుంది. ఈనెల 22న ఇరువైపుల న్యాయవాదులు గడువు కోరడంతో విచారణ నేటికి వాయిదా పడింది. నేడు రఘురామ, విజయసాయిరెడ్డి తరఫు వాదనలు జరగనున్నాయి.

ఇదీ చదవండి:భవిష్యత్​లో... బీసీ, మైనారిటీ, అగ్రవర్ణ పేదలబంధు: కేసీఆర్‌

ABOUT THE AUTHOR

...view details