అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టు విచారణ చేపట్టింది. దీనిపై కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ తరఫు న్యాయవాదులు సమయం కోరారు. అనంతరం తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 17కి వాయిదా వేసింది.
జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా - jagan illigal possessions case latest news
ఏపీ సీఎం జగన్ బెయిల్ రద్దు చేయాలన్న రఘురామ పిటిషన్‌పై హైదరాబాద్ సీబీఐ కోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరారు. తదుపరి విచారణ ఈ నెల 17కి వాయిదా పడింది.

జగన్ బెయిల్ రద్దుపై విచారణ వాయిదా
జగన్ సాక్షులను ప్రభావితం చేస్తున్నారని రఘురామ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆయన బెయిల్ రద్దు చేసి వేగంగా విచారణ చేపట్టాలని కోరారు.
ఇదీ చూడండి: ఏటీఎం యంత్రం ధ్వంసానికి యత్నించిన దుండగుడు