తెలంగాణ

telangana

ETV Bharat / city

Jagan bail cancel petition: జగన్ బెయిల్‌ రద్దుపై 25న సీబీఐ కోర్టు తీర్పు - telangana news

ఏపీ సీఎం జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. రఘురామ పిటిషన్‌పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. సీబీఐ నుంచి ఇంకా సమాచారం రాలేదని.. లిఖితపూర్వక వాదనలకు మరింత సమయం కావాలని సీబీఐ న్యాయవాది కోరారు. ఈ రోజే తెలపాలని కొంతసేపు విచారణను కోర్టు వాయిదా వేసింది.

Jagan bail cancel petition
జగన్ బెయిల్‌ రద్దు పిటిషన్‌

By

Published : Jul 30, 2021, 12:55 PM IST

అక్రమాస్తుల కేసులో ఆంధ్రప్రదేశ్​ సీఎం జగన్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని ఎంపీ రఘురామకృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై సీబీఐ కోర్టులో విచారణ ముగిసింది. రఘురామ పిటిషన్‌పై ఆగస్టు 25న సీబీఐ కోర్టు తీర్పు వెల్లడించనుంది. లిఖితపూర్వక వాదనలకు మరింత సమయం ఇవ్వాలని సీబీఐ న్యాయవాది ధర్మాసనాన్ని కోరారు. సీబీఐ నుంచి ఇంకా సమాచారం రాలేదన్న న్యాయవాది.. మరికొంత గడువు ఇవ్వాలని కోరారు. సీబీఐ అభ్యర్థనను పిటిషనర్‌ రఘురామ తరపు న్యాయవాది వ్యతిరేకించారు. సమయం ఇవ్వొద్దని ధర్మాసనాన్ని కోరారు.

ఇదే రోజు సీబీఐ ఏదో ఒకటి చెప్పాలని.. అందుకు మరింత సమయం ఇస్తామని విచారణను కోర్టు కాసేపు వాయిదా వేసింది. కొంత సేపటి అనంతరం సీబీఐ న్యాయవాది వచ్చి.. తాము ఈ కేసులో ఎలాంటి వాదనలు వినిపించడం లేదని.. విచక్షణ మేరకే నిర్ణయం తీసుకోవాలని కోర్టును కోరారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు.. ఈ కేసులో విచారణ ముగిసిందని, ఆగస్టు 25న తుది తీర్పు వెల్లడిస్తామని తెలిపింది.

ఇదీ చదవండి:Heavy Floods: సాగర్​కు భారీ ఇన్​ఫ్లో.. జూరాలకు కొనసాగుతున్న వరద

ABOUT THE AUTHOR

...view details