తెలంగాణ

telangana

ETV Bharat / city

కరోనాతో టీ ఫైబర్​ ఆవశ్యకత మరింత పెరిగింది: మంత్రి కేటీఆర్​ - ఫైబర్​ గ్రిడ్​పై మంత్రి కేటీఆర్​ సమీక్ష

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో డిజిటల్​ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉన్నాయని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. తెలంగాణ పైబర్​ గ్రిడ్​ ప్రాజెక్టుపై అధికారులతో సమీక్షించారు. భవిష్యత్​లో విద్యా, వైద్యం, ఈ-కామర్స్​, ఐటీ అనుబంధ రంగాల్లో అవసరాలను టీ-ఫైబర్​ తీర్చనుందన్నారు.

it minister ktr review with officers on t-fiber
భవిష్యత్ డిజిటల్​ అవసరాలు తీర్చేది టీ-పైబరే: కేటీఆర్​

By

Published : Jun 16, 2020, 7:05 PM IST

బలమైన డిజిటల్ నెట్​వర్క్​ అవసరాన్ని కరోనా సంక్షోభం నిరూపించిందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్​ అన్నారు. తెలంగాణ ఫైబర్​ గ్రిడ్​ ప్రాజెక్టుపై మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం కరోనాపై జరుగుతున్న యుద్ధంలో డిజిటల్​ మౌలిక వసతులు ప్రభుత్వానికి ఉపయుక్తంగా ఉన్నాయన్నారు. ఆన్​లైన్ ఎడ్యుకేషన్, హెల్త్​కేర్, ఈ-కామర్స్ సేవల నేపథ్యంలో ప్రతిఒక్క రాష్ట్రం, దేశం బలమైన డిజిటల్ నెట్​వర్క్​ కలిగి ఉండాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు. లక్షలాది ఉద్యోగులు వర్క్ ఫ్రం హోమ్ అవకాశాన్ని వినియోగించుకుని పని చేస్తున్న విషయాన్ని గుర్తుచేసిన మంత్రి... ఐటీ, అనుబంధ రంగాల్లో భవిష్యత్తులోనూ ఈ పరిస్థితి కొనసాగే అవకాశం ఉందన్నారు. దీనికోసం ఎలాంటి ఇబ్బందులు లేని బలమైన బ్రాడ్ బ్యాండ్ కనెక్టివిటీ అవసరాలను టీ-ఫైబర్ తీర్చనుందన్నారు.

ఫైబర్ గ్రిడ్ ప్రాజెక్టు అవసరం, ఆవశ్యకత ప్రస్తుత పరిస్థితుల్లో మరింత పెరిగిందని... ప్రాజెక్టు పూర్తయితే సేవల్లో గణనీయమైన మార్పులు వస్తాయని కేటీఆర్​ తెలిపారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలను ప్రపంచంతో కనెక్ట్ చేసేలా ప్రాజెక్టు ఉంటుందన్నారు. త్వరలో అందుబాటులోకి రానున్న రైతువేదికలన్నింటినీ కనెక్ట్ చేయాలని టీ-ఫైబర్ బృందాన్ని మంత్రి ఆదేశించారు. రైతువేదికల ద్వారా రైతులు నేరుగా ముఖ్యమంత్రి, మంత్రి, వ్యవసాయ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుకునే అవకాశం ఉండాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనల మేరకు చర్యలు చేపట్టాలని సూచించారు.

వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, పెంపకం వంటి అంశాల్లో గణనీయమైన లబ్ధి పొందే అవకాశం కూడా కలుగుతుందని కేటీఆర్ చెప్పారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న పూర్తి డిజిటల్ నెట్​వర్క్​, స్టేట్ డాటా సెంటర్​లను టీ-ఫైబర్ పరిధిలోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. టీ-ఫైబర్ ప్రాజెక్టు పరిధిని మరింత విస్తరించి మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు విస్తరించేందుకు ఉన్న అవకాశాలు పరిశీలించాలన్నారు. పనులను క్షేత్రస్థాయిలో మరింత వేగవంతం చేయాలని... రానున్న పదినెలల్లో పూర్తి చేసే దిశగా కసరత్తు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఇదీ చూడండి:భారత్-చైనా సరిహద్దు ఘర్షణలో సూర్యాపేట వాసి మృతి

ABOUT THE AUTHOR

...view details