KTR BIRTHDAY:తెలంగాణ రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు.. మంత్రి కేటీఆర్ రేపు తన జన్మదినం సందర్భంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపేందుకు ఎవరూ నగరానికి రావద్దని విజ్ఞప్తి చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.
ప్రజలకు అందుబాటులో ఉండండి.. అదే నాకు ఇచ్చే బహుమతి: కేటీఆర్ - కేటీఆర్ పుట్టినరోజు వేడుకలు
KTR BIRTHDAY: రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు తన జన్మదిన వేడుకలకు ఎవరూ హైదరాబాద్ రావద్దని కేటీఆర్... పార్టీ శ్రేణులు, అభిమానులకు విజ్ఞప్తి చేశారు. పుట్టిన రోజు వేడుకలు నిర్వహించవద్దని.. వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు సాయం చేయాలని ఆయన కోరారు. స్థానికంగానే ఉండి... గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ సూచించారు.

KTR
పలు జిల్లాల్లో ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నందున.. తెరాస శ్రేణులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని కేటీఆర్ సూచించారు. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు జన్మదిన వేడుకలకు బదులుగా స్థానికంగానే ఉండి... 'గిఫ్ట్ ఏ స్మైల్' కార్యక్రమం కింద వర్షాల వల్ల ఇబ్బంది పడుతున్న ప్రజలకు తమకు తోచిన సాయం చేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇవీ చదవండి: