KTR Help : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్... మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఇద్దరు విద్యార్థులకు ఆర్థిక సాయం అందించారు. పెద్దపల్లి జిల్లాకు చెందిన అవునూరి అఖిల, భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన నీట్లో మంచి మార్కులు సాధించి మెడిసిన్లో సీటు సంపాదించారు. మల్లారెడ్డి మెడికల్ కళాశాల, టీఆర్ఆర్ మెడికల్ కళాశాలల్లో సీటు దక్కించుకున్న వీరికి.. కుటుంబ పరిస్థితి కారణంగా ఫీజులు చెల్లించడం కష్టంగా మారింది. ఈ విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించిన ఆయన.. వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం అందజేశారు.
KTR Help : మరోసారి దాతృత్వాన్ని చాటుకున్న మంత్రి కేటీఆర్..
KTR Help : మంత్రి కేటీఆర్ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. నిరుపేద విద్యార్థినుల ఎంబీబీఎస్ కలను నెరవేర్చేందుకు ఆర్థిక సహాయం అందించారు.
ఇవాళ ప్రగతిభవన్లో తనను కలిసిన విద్యార్థినులు, వారి కుటుంబ సభ్యులతో మాట్లాడిన మంత్రి ఎంబీబీఎస్లోనూ ఇదే స్ఫూర్తి, పట్టుదలతో విజయం సాధించాలని ఆకాంక్షించారు. ఏదైనా సాధించాలనుకుంటే తమకున్న పరిమితులు, పేదరికం, ఆర్థిక పరిస్థితి వంటివి అడ్డుకాదని నిరూపించారని అఖిల, స్పందనను కేటీఆర్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు తెలియజేసిన విద్యార్థినులు.. తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సమాజానికి తమవంతు సేవ చేస్తామని తెలిపారు.
ఇదీ చూడండి :ఇళ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మరో అవకాశం