తెలంగాణ

telangana

ETV Bharat / city

'2024 జులై నాటికి పోలవరం పూర్తి..'!

POLAVARAM: ఏపీలోని పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును కేంద్రప్రభుత్వం మరోసారి పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జులై వరకు సమయం అవసరమని తేల్చింది. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రం ఈ మేరకు జవాబిచ్చింది.

'2024 జులై నాటికి పోలవరం పూర్తి..'!
'2024 జులై నాటికి పోలవరం పూర్తి..'!

By

Published : Jul 19, 2022, 6:42 PM IST

Polavaram: ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వ అసమర్థతతోనే పోలవరం ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యమవుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ ఏడాది ఏప్రిల్ నాటికే పోలవరం నిర్మాణం పూర్తి కావాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్ల ఆలస్యమైనట్లు వెల్లడించింది. రాష్ట్రానికి వ్యూహాత్మక ప్రణాళిక లేకపోవటమే పోలవరం జాప్యానికి కారణమని స్పష్టం చేసింది. నిర్మాణ సంస్థతో సమన్వయ లోపంతో పాటు.. కరోనా మహమ్మారీ పోలవరం ఆలస్యానికి కారణమయ్యాయని కేంద్ర జలశక్తి శాఖ పేర్కొంది.

పోలవరం విషయంలో రాష్ట్రం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం తీవ్రంగా తప్పుబట్టింది. ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు లోపభూయిష్టంగా ఉందని ఆక్షేపించింది. పనుల పురోగతి ఆశించిన స్థాయిలో లేదని పీపీఏ నివేదించినట్లు తెలిపింది. ఈ పరిస్థితుల్లో పోలవరం ప్రాజెక్టు నిర్మాణ గడువును మరోసారి పొడిగించింది. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాజెక్టు పూర్తి చేయడానికి 2024 జులై వరకు సమయం అవసరమని తేల్చింది. తెలుగుదేశం ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి బిశ్వేశ్వర్ టుడు ఈ మేరకు జవాబిచ్చారు.

ABOUT THE AUTHOR

...view details