తెలంగాణ

telangana

ETV Bharat / city

ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు ! - భార్యాభర్తలు

ఎంత దగ్గరి స్నేహితులైనా సరే వాళ్లతో మన భాగస్వామి గురించి చర్చించకూడని కొన్ని విషయాలుంటాయి. అలా అనవసర విషయాలు చర్చించడం వల్ల మనమే వారి విలువ తగ్గించినట్లవుతాం. అసలింతకీ అలాంటి విషయాలేంటో తెలుసుకోవడం అన్ని విధాల శ్రేయస్కారం.

ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు !
ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు !

By

Published : Aug 4, 2020, 2:26 PM IST

* ప్రతి వ్యక్తిలో ఏవో ఒక లోపాలుండటం సహజం. ఎవరితోనైనా ఎక్కువ రోజులు కలిసి ఉంటే వాటిమీద మరింత అవగాహన వస్తుంది. అలాంటివి మీ భర్తలోనూ ఉండొచ్చు. స్నేహితులతో సరదాగా జోకులు వేసుకుంటూ మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలాంటి విషయాలు బయటపెట్టకూడదు. ఆ తరువాత మనమే బాధపడాల్సి వస్తుంది.

* తనకుండే భయాలు, గతంలో చేసిన తప్పులు, ప్రేమ సంగతులు... ఇవన్నీ మీతో మీ భర్త పంచుకొని ఉండొచ్చు. అలాంటి విషయాల్ని ఎంత రహస్యంగా ఉంచితే అంతమేలు. లేదంటే అది ఆ నోటా ఈ నోటా చేరి కొత్త ఇబ్బందులు సృష్టించి మీ బంధానికే సమస్య తెచ్చిపెట్టొచ్చు.

* భార్యాభర్తలన్నాక చిన్న చిన్న మనస్పర్థలు రావడం సహజమే. కానీ ఆ కోపంలో స్నేహితులకు ఫోన్ చేసి ఆ గొడవల గురించి, దాంతో పాటే అంతకుముందున్న సమస్యల గురించీ చెప్పేస్తుంటాం. అవి తాత్కాలికమే అనీ, ఏదో ఆ సమయంలో బాధ తగ్గించుకోవడానికే అలా చేస్తున్నామని మనకు తెలుసు. కానీ ఎదుటి వాళ్లు దాన్ని అలాగే ఆలోచించకపోవచ్చు. అలాచేస్తే అనవసరంగా మీ భర్త గురించి చెడుగా ఆలోచించే అవకాశం కల్పించినవాళ్లవుతారు.

* అలాగే... ఇప్పటివరకూ మీ భాగస్వామితో చెప్పని విషయాలు మీ స్నేహితులతో కూడా చర్చించకపోవడం మేలు. ముఖ్యంగా అవి మీ భర్తకు సంబంధించినవి, ఇబ్బంది పెట్టేవి అయినప్పుడు ఈ సూత్రం అస్సలు మర్చిపోకూడదు.

* ఉద్యోగంలో మంచి పేరు సంపాదించుకోవడం, మంచి ఉద్యోగంలో స్థిరపడడం ప్రతి అబ్బాయికి ఉండే ప్రధాన లక్ష్యం. దానివల్లే ఇతరులు వాళ్లని గౌరవిస్తారు కూడా. అందుకే ఒకవేళ మీ భాగస్వామి ఉద్యోగం కోల్పోయినా, తక్కువ జీతం వస్తున్నా... ఆ విషయాలు స్నేహితులతో చర్చించకపోవడం మేలు. అలా చేస్తే మీరే స్వయంగా వాళ్ల విలువ తగ్గించిన వాళ్లవుతారు.

ఇవీ చూడండి :ష్.. భాగస్వామి గురించి ఈ విషయాలు చెప్పద్దు !

ABOUT THE AUTHOR

...view details