హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణహత్య - scientist
19:24 October 01
హైదరాబాద్‌లో ఇస్రో శాస్త్రవేత్త దారుణహత్య
అమీర్ పేటలో ఓ శాస్త్రవేత్త దారుణహత్యకు గురయ్యారు. బాలానగర్‌లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ ( ఎన్‌ఆర్‌ఎఫ్‌సీ )లో పనిచేసే సురేష్‌ను పదునైన ఆయుధంతో తలపై మోదీ ఆగంతుకులు హతమార్చారు. ధరమ్‌కరమ్ రోడ్డులోని అన్నపూర్ణ హోమ్స్‌లో రెండవ అంతస్తులో ఒంటరిగా ఉంటున్న సురేష్‌ను బాగా పరిచయస్తులే హత్య చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సురేష్ భార్య చెన్నైలోని బ్యాంకులో పనిచేస్తున్నారు. ఆయన పిల్లలు అమెరికాలో నివసిస్తున్నారు. నిన్న రాత్రి హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని చెబుతున్న పంజాగుట్ట ఏసీపీ తిరుపతన్నతో ఈటీవీ భారత్ ముఖాముఖి.
ఇవీ చూడండి: మద్యం షాపు షట్టర్లను పగులగొట్టి చోరీ