భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చేపట్టిన జియో సింక్రోనస్ శాటిలైట్ లాంచ్ వెహికిల్ (జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10) ప్రయోగం విఫలమైందని బాధపడాల్సిన అవసరం లేదని.. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించగలమని ఇస్రో మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు అన్నారు. జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్10 వాహక నౌక ద్వారా జీఐశాట్-1 ఉపగ్రహాన్ని ప్రయోగించగా క్రయోజనిక్ దశలో రాకెట్ సమస్య తలెత్తిందని.. అందుకే వాహకనౌక ప్రయాణించాల్సిన మార్గంలో కాకుండా మరో మార్గంలో వెళ్లిందని ఆయన విశ్లేషించారు.
GSLV: 'నిరుత్సాహం వద్దు.. మళ్లీ విజయం సాధిస్తాం' - gslv failure
జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 10 ప్రయోగం సాంకేతిక సమస్యవల్ల విఫలమవ్వడంపై మాజీ సైంటిస్ట్ చందు సాంబశివరావు మాట్లాడారు. రానున్న కాలంలో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ మెరుగైన విజయాలు నమోదు చేస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
జీఎస్ఎల్వీ
మూడో దశలో సాంకేతిక సమస్య తలెత్తి ప్రయోగం విఫలమైందని వివరించారు. గత ఏడాది మార్చిలోనే ఈ ప్రయోగం చేపట్టాలని నిర్ణయించినా.. సాంకేతిక సమస్యతో నిలిచిపోయిందని గుర్తు చేసుకున్నారు. తాజా ఫలితానికి నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పారు. మున్ముందు మరిన్ని ప్రయోగాలు చేసి విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:ETELA RAJENDER: ఎవరెన్ని కుట్రలు చేసినా గెలుపు నాదే