సీతారామ ప్రాజెక్టు ప్రధానకాల్వ పనులను ఏప్రిల్ నెలాఖరుకల్లా పూర్తి చేస్తామని నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్‌కుమార్ తెలిపారు. ప్రాజెక్టు పరిధిలోని ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదార్లతో ఆయన వర్క్‌షాప్ నిర్వహించారు. ప్యాకేజీల వారీగా ప్రాజెక్టు పనుల పురోగతిని సమీక్షించారు.
జూన్‌లోగా సీతారామ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలి: రజత్ కుమార్ - నీటిపారుదల ముఖ్య కార్యదర్శి రజత్ కుమార్ సమీక్ష
సీతారామ ప్రాజెక్టు పనులపై ఇంజినీర్లు, అధికారులు, గుత్తేదార్లతో... నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి రజత్ కుమార్ వర్క్‌షాప్ నిర్వహించారు. జూన్‌లోగా పూర్తి చేసి నీరివ్వాలని సీఎం ఆదేశించినట్టు తెలిపారు.
జూన్‌లోగా సీతారామ ప్రాజెక్టు పనులన్నీ పూర్తి చేయాలి: రజత్ కుమార్
జూన్‌లోగా పనులను పూర్తి చేసి నీరివ్వాలన్న సీఎం ఆదేశాల నేపథ్యంలో... ఆయా పనుల పూర్తికి గడువు విధించారు. ఏప్రిల్ వరకు ప్రధానకాల్వ పనులను పూర్తి చేసి సాగునీరిస్తామని... మిగిలిన పనులకు కొంత సమయం పడుతుందని అధికారులు, ఇంజనీర్లు తెలిపారు.
ఇదీ చూడండి:ఉద్యోగ సంఘాల విజ్ఞప్తులను పరిశీలించి నివేదిక ఇవ్వండి: పీఆర్సీ కమిటీ