తెలంగాణ

telangana

ETV Bharat / city

చుట్టు ముట్టి.. పరిహారానికి పట్టు బట్టి

వరద ముంపు బాధితుల నిరసనలతో నగరం దద్దరిల్లింది. బాధితులకు ప్రభుత్వం అందిస్తోన్న రూ.10వేల పరిహారంలో అవకతవకలపై భగ్గుమన్న జనం శనివారం నగరంలోని బల్దియా కార్యాలయాలతో పాటు శాసనసభ్యులు, కార్పొరేటర్ల ఇళ్లను ముట్టడించారు.

compensation distribution for Hyderabad flood victims
హైదరాబాద్ వరద బాధితుల ఆందోళన

By

Published : Nov 1, 2020, 7:57 AM IST

భాగ్యనగరాన్ని ముందచెత్తిన వరదతో జనజీవనం అస్తవ్యస్తమయింది. వరద బాధితులకు అండగా నిలవడానికి రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోన్న ఆర్థిక సాయం పంపిణీలో జరుగుతున్న అవకతవకలపై భగ్గుమన్న బాధితులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు.

మల్లాపూర్‌ కార్పొరేటర్‌ ఇంటిని రాత్రి సమయానికి్ ముట్టడించిన మహిళలు పెట్రోల్‌ సీసాలు పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు.

ఫాక్స్‌సాగర్‌కు ముంపునకు గురైన ఉమామహేశ్వరకాలనీ వాసులు కొంుపల్లి మున్సిపల్‌ కార్యాలయం ఎదుట శనివారం ఆందోళనకు దిగారు.

చాంద్రాయణగుట్ట నర్కిపూల్‌బాగ్‌లోని చార్మినార్‌ జోన్‌ కార్యాలయం ఆవరణలో, మాదన్నపేట చౌరస్తాలో వరద బాధితులతో కలిసి భాజపా నాయకులు ధర్నాకు దిగడంతో ట్రాఫిక్‌ స్తంభించిపోయింది. సికింద్రాబాద్‌ జోనల్‌ కార్యాలయం, ఉప్పల్‌, కాప్రా సర్కిల్‌ కార్యాలయాలకు బాధితులు పోటెత్తారు. అంబర్‌పేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద ఓ బాధితుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుంటుండగా అక్కడున్న వారు అడ్డుకున్నారు.

బంజారాహిల్స్‌ ఉదయనగర్‌లో ఉండే భిక్షపతి (50) రేకుల నివాసంలో ఉంటాడు. ఇటీవల వరదలతో అతని ఇల్లు దెబ్బతింది. ప్రభుత్వ ఆర్థిక సాయం కోసం తిరిగాడు. శనివారం వరద బాధితులకు సహాయం నిలిపివేశారనే వార్త విని గుండెపోటుతో మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

ఆర్థిక సాయం పంపిణీ కార్యక్రమాన్ని పొడిగిస్తాం

‘‘నగరంలో అర్హులైన వరద బాధితులందరికీ రూ. 10 వేల ఆర్థిక సాయాన్ని తప్పక అందిస్తాం. మరికొద్ది రోజుల పాటు పంపిణీ కార్యక్రమాన్ని పొడిగిస్తాం. దీనిపై ఆదివారం అధికారులతో సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకుంటాం.’’

- పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌

ABOUT THE AUTHOR

...view details