Irani chai :హైదరాబాద్ షాన్ ‘ఇరానీ చాయ్’ ధర పెంపునకు హోటళ్ల బృందం నిర్ణయం తీసుకుంది. నేటి నుంచి రూ.5 పెంచనున్నట్లు తెలిపారు. పెరుగుతున్న నిత్యావసర ధరలతో హోటళ్ల మనుగడ సాగని క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం కప్పు టీ ధర రూ.15 నుంచి రూ.20కి పెంచారు. కరోనా ప్రభావం ఈ హోటళ్లపైనా పడింది.
Irani chai: నేటి నుంచి ‘ఇరానీ చాయ్’ ధర రూ.5 పెంపు.. - Irani Tea price hike
Irani chai : నేటి నుంచి ఇరానీ చాయ్ ధర పెరగనుంది. నాణ్యమైన, ప్రత్యేకమైన రుచి కలిగి ఉండే ఇరానీ చాయ్ తయారీకి అయ్యే ఖర్చు రోజురోజుకు పెరిగిపోతుండటం వల్లే హోటళ్ల యజమానులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం ఒక కప్పు చాయ్ ధర రూ. 15 ఉండగా.. ఇప్పుడు రూ.20కి పెరిగింది.
Irani Tea : ఇరానీ చాయ్‌పత్తా ధర కిలో రూ.300నుంచి రూ.500కు చేరుకొంది. నాణ్యమైన పాలతో మాత్రమే సంప్రదాయ ఇరానీ చాయ్ చేయడం సాధ్యం. ప్రస్తుతం నాణ్యమైన పాలు లీటరు రూ.100కు చేరగా వాణిజ్య సిలిండర్ ధర కూడా భారీగా పెరిగింది. కరోనా తర్వాత నిర్వహణ ఖర్చులు పెరిగిపోవడంతో.. పాత ధరకు విక్రయించడం సాధ్యం కాదని హోటళ్ల నిర్వాహకులు చెబుతున్నారు. ఇరానీ చాయ్ తయారు చేయడమూ ఓ ప్రత్యేక కళే. పాలు, టీ పొడి, నాణ్యత విషయంలో ఏ మాత్రం రాజీ పడినా ప్రత్యేక రుచి రాదు. దీంతో ధరలు పెంచక తప్పడం లేదంటున్నారు.
ఇదీ చూడండి: