తెలంగాణ

telangana

ETV Bharat / city

'సంస్కరణల ఆకాంక్షతోనే చేరా.. విఫలమైనందునే తప్పుకుంటున్నా' - పోలీస్​ అకాడమీ సంచాలకుడు వీకే సింగ్​ రాజీనామా

రాష్ట్ర పోలీస్‌ అకాడమీ సంచాలకుడు వీకే సింగ్ రాజీనామా చేశారు. రాజీనామా లేఖను కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు. గాంధీ జయంతి రోజు పదవీ విరమణ పొందాలనుకుంటున్నట్టు పేర్కొన్నారు. మూడునెలల ముందుగానే నోటీసులు ఇస్తున్నందున తన రాజీనామా ఆమోదించాలని కోరారు.

Vk Singh ips office Vk Singh
'సంస్కరణల ఆకాంక్షతోనే చేరా.. విఫలమైనందునే తప్పుకుంటున్నా'

By

Published : Jun 25, 2020, 5:42 AM IST

రాజా బహదూర్‌ వెంకట్రామిరెడ్డి పోలీసు అకాడమీ సంచాలకుడు, ఐపీఎస్‌ అధికారి వీకే సింగ్‌ రాజీనామా చేశారు. లేఖకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి, రాష్ట్రప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపించారు.

తాను తెలంగాణ కేడర్‌కు చెందిన 1987 ఆర్‌ఆర్‌ బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి.. పోలీస్​ శాఖలో సంస్కరణలు తీసుకురావాలనే ఆకాంక్షతో విధుల్లో చేరాను. తన ఆశయాలు సాధించడంలో విఫలమైనట్లు భావిస్తున్నాను. తెలంగాణ ప్రభుత్వం తన సేవలతో సంతృప్తి చెందలేదనుకుంటున్నాను. తన సేవలు మరింత వినియోగించుకోవాలనే కోరిక నెరవేరలేదు.

-రాజీనామా లేఖలో వీకే సింగ్​

ఎవరికీ వ్యతిరేకం కాదు

తాను ఏ ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని.. రాష్ట్రంలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు యత్నిస్తానన్నారు. ప్రభుత్వం తనకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగంలో చేరాలనుకుంటే తప్పనిసరిగా పోలీసు శాఖనే ఎంచుకోవాలని సూచించారు.

సంచలనాలకు కేంద్రం

వీకే సింగ్‌ ఆది నుంచి సంచలనాలకు కేంద్రంగా మారారు. గతంలో జైళ్ల శాఖ డీజీగా ఉన్న ఆయనను ప్రింటింగ్‌ అండ్‌ స్టేషనరీ విభాగానికి మార్చినప్పుడు విచారం వ్యక్తం చేశారు. అనంతరం ఆయనను తెలంగాణ పోలీసు అకాడమీకి బదిలీ చేశారు. బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే అసంతృప్తి వ్యక్తంచేశారు. పోలీస్​ అకాడమీ డంపింగ్‌ యార్డులా మారిందని... ఐపీఎస్‌లకు శిక్షణ ఇచ్చే జాతీయ పోలీస్​ అకాడమీ అందుకు అతీతం కాదని సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు డీజీపీగా పదోన్నతి కల్పించాలని రాష్ట్రప్రభుత్వ ప్రభుత్వ ప్రధానికి కార్యదర్శికి లేఖ రాశారు. లేకుంటే రాజీనామా చేస్తానన్నారు. ఈ ఏడాది నవంబరులో ఉద్యోగ విరమణ పొందాల్సి ఉన్నా ముందుగానే రాజీనామా చేశారు.

ఇవీచూడండి:ప్రభుత్వం సంతృప్తిగా లేనట్టుంది.. బయటి నుంచే సేవచేస్తా: వీకే సింగ్

ABOUT THE AUTHOR

...view details