Intellectual Property Rights: మానవ మేధస్సు, సృజనాత్మకత, ఆవిష్కరణలకు రక్షణ కల్పించేవే మేథో సంపత్తి హక్కులు. ఇంటలెక్చువల్ ప్రాపర్టీ- ఐపీలో భాగంగా.. ఐడియాలకు, ఆవిష్కరణలకు కాపీరైట్లు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు పొందవచ్చు. దీంతో.. వాటి వాణిజ్య, ప్రచార, నైతిక హక్కులు మనకు దక్కుతాయి. ఐతే..దీనిపై సరైన అవగాహన లేక.. చాలామంది ఆవిష్కర్తలు తమ బ్రాండ్‌ను.. ఇతరులు క్యాష్ చేసుకుంటున్నా.. ఏం చేయలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో.. పెద్దా, చిన్న అనే తేడా లేకుండా వినూత్న ఆలోచనలకు హక్కులు కల్పించేందుకు "ఐపీ మస్కట్ రచిత్ ” ముందుకు వచ్చింది. మేథో పరమైన హక్కులపై యువతకు అవగాహన కల్పించేందుకు సన్నద్ధమైంది. అసలు ఈ ప్రాజెక్ట్ లక్ష్యాలేంటి..? ఏయే రంగాల్లో ఐపీ కీలక పాత్ర పోషిస్తోంది..? చదువుకోని వారు ఐపీకి ఎలా దరఖాస్తు చేయాలి..? తదితర అంశాలు రిజల్యూషన్ ఫర్ ఐపీ లీగల్ హెడ్ సుబజిత్ సాహాను అడిగి తెలుసుకుందాం.
Intellectual Property Rights: మీ ఐడియాలు, ఆవిష్కరణలకు హక్కులు కల్పించండిలా..! - ఐపీ
Intellectual Property Rights: నేటి యువత వద్ద ఐడియాలకు, క్రియేటివిటీకి కొదవలేదు. సరైన సాయం దొరకాలే కానీ.. ఆవిష్కరణలకు అడ్డులేదు. అలా ఎంతో మంది యువత ఎన్నో రకాల ఆవిష్కరణలకు నాంది పలికారు. కానీ వాటికి కాపీరైట్లు, పేటెంట్లు, ట్రేడ్ మార్కులు ఉంటాయని తెలియక చాలా మంది తమ బ్రాండ్‌ను ఇతరులు క్యాష్ చేసుకుంటున్నా ఏం చేయలేకపోతున్నారు. అలాంటి వారి కోసమే ఐపీ మస్కట్ రచిత్ ముందుకొచ్చింది. ఆలోచన చిన్నదైనా.. పెద్దదైనా.. దానికి హక్కులు కల్పిస్తోంది. మేథో పరమైన హక్కులు(ఇంటలెక్చువల్ ప్రాపర్టీ) అంటే ఏంటి? అసలీ ప్రాజెక్ట్ లక్ష్యమేంటి? దీనికి ఎలా దరఖాస్తు చేయాలో తెలుసుకుందాం..
Intellectual Property Rights