పోలీస్ సిబ్బందికి లైఫ్ జాకెట్లను అందించిన ఐఓసీఎల్ - mahesh bagawath news
మేడ్చల్ జిల్లా నేరెడ్మెట్ రాచకొండ సీపీ కార్యాలయంలో ఐఓసీఎల్ వారు పోలీస్ సిబ్బంది కోసం 52 లైఫ్ జాకెట్లను సీపీ మహేశ్ భగవత్‌కు అందించారు. భారీ వర్షాలు, వరదల కారణంగా రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో లోతట్టు ప్రాంతాలకు వెళ్లి భాదితులకు సాయం చేసేందుకు పోలీస్ సిబ్బంది ఇబ్బందులు పడుతున్నట్లు గుర్తించి జాకెట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఐఓసీఎల్ వారికి సీపీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
iocl donated life jackets to police in rachakonda