తెలంగాణ

telangana

ETV Bharat / city

'జీపీఎఫ్​ సొమ్మును ఎందుకు ఉపసంహరించారు..?'

High Court on GPF: ఏపీ ప్రభుత్వంపై ఆ రాష్ట్ర హైకోర్టు సీరియస్​ అయ్యింది. ఉద్యోగుల జీపీఎఫ్​ మాయం అంశంపై హైకోర్టులో విచారణ సందర్బంగా.. హైకోర్టు పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సాంకేతిక తప్పితం వల్లేనని ప్రభుత్వ న్యాయవాది జవాబివ్వగా.. ఎప్పుడూ ఇదేవిధంగా చెబితే ఓ చార్టెట్​ అకౌంటెంట్​ను అడ్వకేట్​ కమిషనర్​గా నియమించాల్సి వస్తుందని తెలిపింది. అఫిడవిట్​ ఎవరు దాఖలు చేసినా.. సీఎస్​ బాధ్యులు అవుతారని సూచించింది.

investigation-in-the-high-court-on-the-issue-of-gpf-embezzlement-of-employees
investigation-in-the-high-court-on-the-issue-of-gpf-embezzlement-of-employees

By

Published : Jul 22, 2022, 8:05 PM IST

High Court on GPF: జీపీఎఫ్​ సొమ్మును ఎందుకు ఉపసంహరించారని ఏపీ ప్రభుత్వాన్ని ఆ రాష్ట్ర హైకోర్టు ప్రశ్నించింది. సాంకేతిక తప్పిదం వల్లే జరిగిందని ప్రభుత్వ న్యాయవాది జవాబివ్వగా.. ప్రతీసారి ఇలాగే చెబితే ఓ చార్టెడ్ అకౌంటెంటును అడ్వకేట్ కమిషనర్‌గా నియమించాల్సి వస్తుందని హైకోర్టు అభిప్రాయపడింది. ప్రభుత్వానికి అవసరమై 2 వేల కోట్ల రూపాయలు వాడుకున్నారన్న హైకోర్టు.. ఎప్పుడు జమ చేస్తారని ప్రశ్నించింది. కిందిస్థాయి అధికారితో అఫిడవిట్ వేయించడం సరికాదని పిటిషనర్ తరఫు న్యాయవాది రవితేజ కోర్టుకు నివేదించగా.. సమయాభావంతో అలా జరిగిందని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఇకపై ప్రిన్సిపల్ సెక్రటరీ అఫిడవిట్ దాఖలు చేస్తారని సమాధానమిచ్చారు.

ఎవరు అఫిడవిట్ దాఖలు చేసినా.. సీఎస్ బాధ్యులు అవుతారని తెలిపిన న్యాయస్థానం.. నగదు ఎప్పుడు జమ చేస్తారో పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఆగస్టు 3కి వాయిదా వేసింది. జీపీఎఫ్​ ఖాతాల నుంచి సొమ్ముల ఉపసంహరణపై గెజిటెడ్ ఉద్యోగుల సంఘం నేత కృష్ణయ్య దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో మరోసారి విచారణ జరిగింది.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details