'ఏలూరుకు సురక్షితమైన నీటినే సరఫరా చేస్తున్నాం'
ఏపీ ఏలూరులో వింత మూర్ఛ వ్యాధికి కారణాలేమిటన్నది ఇప్పటికీ మిస్టరీగానే ఉన్నా.. నీటిలో భార లోహాలు పరిమితికి మించి ఉన్నట్లు ఎయిమ్స్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏలూరు నగరానికి నీటి సరఫరా చేస్తున్న పంపుల చెరువుపై జాతీయ పరిశోధన సంస్థలు దృష్టి పెట్టాయి. ఎయిమ్స్‌తో పాటు ఎన్ఐఎన్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ, పుణేలోని వైరాలజీ ల్యాబ్, ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్, సీసీఎంబీ, డబ్ల్యూహెచ్ఓ ప్రతినిధులు ఇక్కడి నుంచి నీటి నమూనాలు సేకరించారు. ఏలూరు నగరానికి రోజూ 35 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేస్తున్న పంపుల చెరువు అధికారులతో ముఖాముఖి.
'ఏలూరుకు సురక్షితమైన నీటినే సరఫరా చేస్తున్నాం'