కరోనా నేపథ్యంలో బియ్యం పంపిణీ ఎలా కొనసాగుతోంది.
ఈ రోజు ఉదయం వరకు 63 లక్షల మంది రేషన్ కార్డుదారులు బియ్యం తీసుకున్నారు. మిగిలిన 30 శాతం మందికి మరో ఐదారు రోజుల్లో పంపిణీ చేస్తాం.
జంట నగరాల్లో చౌకధరల దుకాణాల ముందు లబ్ధిదారులు బారులు తీరుతున్నారు. సర్వర్ మొరాయించడం వల్ల పంపిణీలో జాప్యం జరుగుతోంది. వాటిని ఎలా అధిగమిస్తున్నారు.
సాధారణ పరిస్థితుల్లో రోజుకు 2 లక్షల మంది లబ్ధిదారులు బియ్యం తీసుకునేవారు. ఇప్పుడు ఒకేసారి 7 నుంచి 8 లక్షల మంది రావడంతో సర్వర్లో సాంకేతిక సమస్యలు వచ్చాయి. వాటిని ఎప్పటికప్పుడు అధిగమిస్తున్నాం. లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటున్నాము.
ప్రభుత్వం ఇస్తామన్న రూ.1500 నగదును ఎప్పటివరకు అందిస్తారు.
ఇవాళ్టి నుంచి విడతల వారిగా లబ్ధిదారుల ఖాతాలో వేస్తాం.
ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా బియ్యంతో పాటు నిత్యావసర వస్తువులు పంపిణీ చేసే అవకాశం ఉందా.
కిలో పప్పు పంపిణీ చేస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఆ మేరకు కేంద్రానికి లేఖ రాశాము. కేంద్రం నుంచి వచ్చిన వెంటనే పంపిణీ చేస్తాం.