తెలంగాణ

telangana

ETV Bharat / city

దేశంలో 57.29% మందికి ఇంటర్నెట్‌ కనెక్షన్లు - internet connection increased in Hyderabad

కరోనా వ్యాప్తితో విధించిన లాక్​డౌన్​తో ఆన్​లైన్ తరగతులు, వర్క్ ఫ్రం హోం విధానం పెరిగింది. క్రమంగా ఇంటర్నెట్ వాడకమూ పెరగడం వల్ల గణనీయంగా డేటా వినియోగం జరిగింది. ట్రాయ్ గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా మార్చిలో 68.74 కోట్ల మంది వినియోగదారులుండగా.. డిసెంబర్ నాటికి వారి సంఖ్య 74.74 కోట్లు అయింది.

internet connection increased in India is increased during lockdown
దేశంలో 57.29% మందికి ఇంటర్నెట్‌ కనెక్షన్లు

By

Published : Feb 20, 2021, 6:58 AM IST

కరోనా లాక్‌డౌన్‌, ఆన్‌లైన్‌ తరగతులు, వర్క్‌ ఫ్రం హోమ్‌ విధానంతో డేటా వినియోగం గణనీయంగా పెరిగింది. టెలికాం నియంత్రణ సంస్థ (ట్రాయ్‌) గణాంకాల ప్రకారం దేశవ్యాప్తంగా జూన్‌ 2020 నాటికి 55.41 శాతం మంది ప్రజలకు బ్రాడ్‌బ్యాండ్‌/ఇంటర్నెట్‌ కనెక్షన్లు ఉండగా సెప్టెంబరుకు అది 57.29 శాతంగా ఉంది. కనెక్షన్ల పరంగా చూస్తే ఇదే కాలానికి ఆ సంఖ్య 74.90 కోట్ల నుంచి 77.64 కోట్లకు చేరింది. కేవలం బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్ల వరకే తీసుకుంటే దేశవ్యాప్తంగా మార్చిలో 68.74 కోట్ల మంది వినియోగదారులు ఉండగా డిసెంబరు నాటికి వారి సంఖ్య 74.74 కోట్లు అయింది. దాదాపు తొమ్మిది శాతం బ్రాడ్‌బ్యాండ్‌ కనెక్షన్లు పెరిగాయి.

  • లాక్‌డౌన్‌ సడలింపులు మొదలైన తరువాత డేటా వినియోగం తగ్గింది.
  • ఏప్రిల్‌ నుంచి జూన్‌ కాలానికి ఒక వ్యక్తి నెలవారీ డేటా వినియోగం సగటున 12.15 జీబీ ఉంటే... జులై నుంచి సెప్టెంబరు నాటికి అది 11.96 జీబీకి పరిమితమైంది.
  • దేశవ్యాప్తంగా 96.92 శాతం మొబైల్‌ కనెక్షన్లకు ఇంటర్నెట్‌ అందుబాటులోకి వచ్చింది.

తెలుగు రాష్ట్రాల్లో ఇలా..

తెలుగు రాష్ట్రాల్లోనూ గ్రామీణ ప్రాంతాల్లో అంతర్జాల కనెక్షన్లు పెరిగాయి. ఏప్రిల్‌ నుంచి జూన్‌ 2020 కాలానికి పల్లెల్లో 2.60 కోట్ల కనెక్షన్లు ఉండగా జులై-సెప్టెంబరు కాలానికి ఆ సంఖ్య 2.66 కోట్లకు పెరిగింది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కలిపి చూసినప్పుడు ఇదే కాలానికి కనెక్షన్ల సంఖ్య 5.91 కోట్ల నుంచి 6.10 కోట్లకు చేరింది. వినియోగంలో ఉన్న కనెక్షన్ల పరంగా మహారాష్ట్ర సర్కిల్‌ తరువాత ఏపీ, తెలంగాణ ఉమ్మడి టెలికం సర్కిల్‌ రెండో స్థానంలో ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రతి వంద మందిలో 67.69 శాతం మందికి ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉన్నాయి.

ABOUT THE AUTHOR

...view details