Women's Day celebrations in Qatar: మహిళల సాంస్కృతిక, రాజకీయ, సామాజిక, ఆర్థిక విజయాలను గౌరవించేందుకు ప్రతి సంవత్సరం మార్చి 8న నిర్వహించుకునే “అంతర్జాతీయ మహిళా దినోత్సవం" కార్యక్రమాన్ని “ఆంధ్ర కళా వేదిక” వారు ఈ సంవత్సరం ఘనంగా నిర్వహించింది. నేపథ్యం "బ్రేక్ ది బయాస్" తో మార్చి 09, 2022న ఐసీసీ ప్రాంగణంలోని అశోకా హాల్‌లో ఈ వేడుకలు జరిపారు.
ఖతార్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు భారత రాయబార కార్యాలయం నుంచి ఫస్ట్ సెక్రటరీ(రాజకీయ&సమాచారం) పద్మ కర్రీ వేడుకల్లో పాల్గొన్నారు. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించినందుకు పాల్గొన్న వారందరినీ, ఆంధ్ర కళా వేదిక కార్యవర్గ బృందాన్ని అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు వెంకప్ప భాగవతుల మాట్లాడారు.
'ఈ కార్యక్రమం కేవలం 2 రోజుల వ్యవధిలో నిర్వహించినప్పటికీ, ఖతార్‌లోని తెలుగు వారి నుంచి అద్భుతమైన స్పందన వచ్చింది. మా కార్యవర్గ బృందం చేసిన కృషికి కార్యక్రమ లక్ష్యం నెరవేరింది. మద్దతు ఇచ్చినందుకు ఐసీసీ మేనేజ్‌మెంట్ టీమ్‌కి కృతజ్ఞతలు.'
-వెంకప్ప భాగవతుల, ఆంధ్ర కళా వేదిక అధ్యక్షులు
Women's Day celebrations: బహుముఖ ప్రదర్శనలు (ఏకపాత్రాభినయం, నృత్యాలు, పాటలు, లఘు నాటికలు), వివిధ రంగాలకు చెందిన ప్రముఖ తెలుగు మహిళలకు(డాక్టర్లు, శాస్త్రవేత్తలు, ప్రొఫెసర్లు, ఉపాధ్యాయులు, సామాజిక సేవకులు మొదలైనవారికి) సన్మానాలు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఖతార్‌లో ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు వేడుకలకు శిరీషా రామ్, సుధ వ్యాఖ్యాతలుగా వ్యవహరించగా, ప్రధాన కార్యదర్శి విక్రమ్ సుఖవాసి ముగింపు సందేశంతో కార్యక్రమం ముగించారు. వేడుకని ఇంత విజయవంతంగా నిర్వహించుకోవటానికి సహకరించిన దాతల(స్పాన్సర్స్)కి, స్వచ్ఛంద సేవకుల(వాలంటీర్స్)కి, ఇంకా ప్రత్యక్షంగా పరోక్షంగా సహాయాన్ని అందించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఐసీసీ ప్రెసిడెంట్ పీఎన్ బాబు రాజన్, వైస్ ప్రెసిడెంట్ సుబ్రమణ్య హెబ్బాగులు, జనరల్ సెక్రటరీ కృష్ణ కుమార్, సజీవ్ సత్యశీలన్, కమల ఠాకూర్, ఐసీబీఎఫ్ నుంచి రజనీ మూర్తి, పలువురు ప్రముఖులు.. నాయకులు ఎల్.ఎన్.ముస్తఫా, సుమా మహేష్ గౌడ్, ఇతర ప్రముఖ తెలుగు సంఘాల అధ్యక్షులు, వారి కార్యవర్గ బృందం సభ్యులూ పాల్గొని నిర్వహించినందుకు ఏంబసీ ఫస్ట్ సెక్రటరీ పద్మ కర్రీ అభినందించారు.
ఇదీ చదవండి:KTR On Data Science: 'డేటా సైన్స్‌కు గత ప్రభుత్వాలు తగిన ప్రాధాన్యమివ్వలేదు'