సమాజంలో మార్పు రావాలంటే ఆధ్యాత్మిక మార్గమే సరైన విధానమని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు అన్నారు. స్త్రీ, పురుషులకు రాజ్యాంగం సమాన అవకాశాలు కల్పించినప్పుడు.. ఆలోచన విధానంలో ఎందుకు మార్పు రావడం లేదని ప్రశ్నించారు. హైదరాబాద్ ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్ ఆధ్వర్యంలో హిమయాత్‌నగర్‌లోని ఏవీకళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
'ఆలోచనల్లో ఎందుకు మార్పు రావడం లేదు' - ఉమర్ ఆలీషా రూరల్ డెవలప్‌మెంట్ ట్రస్ట్
స్త్రీ, పురుషులకు రాజ్యాంగం సమానం అవకాశాలు కల్పించినప్పుడు.. ఆలోచన విధానంలో ఎందుకు మార్పు రావడం లేదని హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు ప్రశ్నించారు. ఏవీ కళాశాలలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అథితిగా పాల్గొన్నారు.
హిమయాత్‌నగర్‌లోని ఏవీకళాశాల
జస్టిస్ రామలింగేశ్వరరావుతో పాటు అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ప్రదీప్‌కుమార్‌రెడ్డి, అడిషినల్ డీఎం నిర్మల ప్రభావతి, ఉమర్ ఆలీషా రూరల్ డెవల్ప్‌మెంట్ ట్రస్ట్ ఛైర్మన్ ఉమర్ ఆలీషా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.
TAGGED:
హిమయాత్‌నగర్‌లోని ఏవీకళాశాల