ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. దానికి సంబంధించిన సర్టిఫికెట్ను మంత్రి అవంతి శ్రీనివాస్.. ఈవో సూర్యకళకు అందించారు. అంతకుముందు స్వామి వారిని దర్శనానికి వచ్చిన మంత్రికి ఆలయ అధికారులు వేదమంత్రాల నడుమ ఘనస్వాగతం పలికారు. అనంతరం అర్చకులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో సూర్యకళ మంత్రికి ప్రసాదాన్ని అందించారు.
Simhachalam temple: సింహాచలం ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు - simhachalam temple
ఏపీలోని విశాఖపట్నం జిల్లా సింహాచలంలోని సింహాద్రి అప్పన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, పరిశుభ్రత, పచ్చదనానికి గాను ఈ గుర్తింపు దక్కింది. ఈ మేరకు ఆలయ ఈవో సూర్యకళకు మంత్రి అవంతి శ్రీనివాస్ ఐఎస్‌వో ధ్రువపత్రం అందజేశారు. కేంద్ర ప్రసాదం పథకం కింద సింహాద్రి అప్పన్న ఆలయానికి రూ.53కోట్లు వచ్చినట్టు ఈవో తెలిపారు.
international-recognisation-simhachalam-temple
సింహాచలం ఆలయానికి ఐఎస్‌వో గుర్తింపు లభించడం ఎంతో గర్వంగా ఉందని ఆయన అన్నారు. ప్రసాద్ స్కీమ్ ద్వారా దేవస్థానానికి సుమారుగా రూ.53 కోట్లు నిధులు కేటాయించారని వెల్లడించిన అవంతి.. ఆ నిధులతో తొందరలోనే పనులు చేపడతామని స్పష్టం చేశారు. అంతర్జాతీయ గుర్తింపునకు శ్రమించిన దేవస్థానం అధికారులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. స్వామి వారి ఆశీస్సులతో త్వరలోనే పంచగ్రామాల్లో భూసమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలిపారు.