తెలంగాణ

telangana

ETV Bharat / city

త్వరలో పౌల్ట్రీ పాలసీ: మంత్రి తలసాని - international poultry festival at hyderabad

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ మాదాపూర్‌లోని హెచ్​ఐసీసీ సెంటర్​లో ప్రారంభమైంది. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ ప్రదర్శనను ప్రారంభించారు. ఇండియన్ పౌల్ట్రీ పరికరాల తయారీదారుల అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ప్రదర్శనలో 375 కంపెనీలు పాల్గొంటున్నాయి. దేశ విదేశాల నుంచి వివిధ కంపెనీలు ఇక్కడ తమ సాంకేతికతలతో పాటు పరికరాలను ప్రదర్శించనున్నాయి.

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ఎగ్జిబిషన్
ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ఎగ్జిబిషన్

By

Published : Nov 28, 2019, 5:34 AM IST

Updated : Nov 28, 2019, 7:51 AM IST

ఆసియాలోనే అతిపెద్ద అంతర్జాతీయ పౌల్ట్రీ ఎగ్జిబిషన్

హైదరాబాద్‌లో గత 12 ఏళ్లుగా జరుగుతున్న పౌల్ట్రీ ఇండియా ఎక్స్‌పో బుధవారం హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో ఘనంగా ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వివిధ కంపెనీలు ఇక్కడ తమ స్టాళ్లను ఏర్పాటు చేశాయి. ఆఫ్రికా, మధ్య ఆసియా, బంగ్లాదేశ్ నుంచి సందర్శకులు వస్తున్నారు. మూడు రోజుల పాటు జరగనున్న ఈ ఎగ్జిబిషన్‌లో మొత్తం 375 సంస్థలు తమ పరికరాలను సందర్శకులకు అందుబాటులో ఉంచాయి.

త్వరలో పాలసీ...

ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరైన మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పౌల్ట్రీ రంగంపై ముఖ్యమంత్రి కేసీఆర్, కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేశారని అన్నారు. పౌల్ట్రీ పరిశ్రమకు సంబంధించి త్వరలో మంచి పాలసీని తీసుకొస్తామని అన్నారు. ఈ పరిశ్రమలోని నిపుణులు, రైతులతో మాట్లాడి పాలసీని తయారు చేస్తామన్నారు. దీనికోసం వివిధ రాష్ట్రాల్లో కూడా పర్యటించనున్నామని తెలిపారు.

మంత్రికి రైతుల నిరసన సెగ...

ఎగ్జిబిషన్‌కు హాజరైన తెలంగాణ రైతులు.... తమను ఆదుకోవాలంటూ నిరసన వ్యక్తం చేశారు. లేయర్ కోళ్ల కోసం ఎగ్ బోర్డును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఈసీసీ రేటును రైతులకు చెల్లించాలని, కనీస మద్దతు ధరను ఇవ్వాలని వారు కోరారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన దాణా కూడా నిజమైన రైతులకు చేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమపై బ్రీడర్స్ ఆధిపత్యం వహిస్తున్నారని...దానిని తగ్గించాలంటూ వారు నినాదాలు చేశారు.

స్పందించిన మంత్రి...

రైతుల నిరసనలపై స్పందించిన మంత్రి తలసాని.. తమ సమస్యలను చెప్పుకునేందుకు అనేక వేదికలున్నాయని అన్నారు. ఇలాంటి కార్యక్రమాల్లో నిరసన చేపట్టటం మంచిది కాదని... భవిష్యత్తులో ఇలాంటి వాటిని సహించే పరిస్థితి ఉండదన్నారు.

ఇవీ చూడండి: పౌల్ట్రీ ప్రదర్శనలో మంత్రికి నిరసన సెగ

Last Updated : Nov 28, 2019, 7:51 AM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details