తెలంగాణ

telangana

ETV Bharat / city

ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ కేసుపై శాఖాపరమైన విచారణ - ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్ కేసు తాజా వార్తలు

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ కేసులో శాఖాపరమైన విచారణ ప్రారంభమైంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ముందు ఏబీ వెంకటేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తిచేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

internal-investigation-started-in-ab-venkateswarao-case
ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్​ కేసు: ప్రారంభమైన శాఖాపరమైన విచారణ

By

Published : Mar 18, 2021, 3:18 PM IST

కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఎదుట ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఎ.బి.వెంకటేశ్వరరావు విచారణకు హాజరయ్యారు. ఆయనపై మోపిన అభియోగాలకు సంబంధించిన శాఖాపరమైన విచారణ మొదలైంది. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ ఆర్పీ సిసోడియా నేతృత్వంలో విచారణ జరుగుతోంది. శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజువారీ విచారణ చేపట్టాలని విచారణాధికారిని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది.

విచారణ నివేదికను మే 3 నాటికి కోర్టుకు సమర్పించాలని ఏపీ ప్రభుత్వానికి అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. మాజీ డీజీపీలు రాముడు, సాంబశివరావు, మాజీ డీజీపీలు మాలకొండయ్య, ఆర్పీ ఠాకూర్ సాక్షులుగా విచారణకు హాజరుకానున్నారు.

ఇదీ చదవండి:వైభవోపేతంగా జూబ్లీహిల్స్​ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు..

ABOUT THE AUTHOR

...view details