తెలంగాణ

telangana

ETV Bharat / city

Conflicts in Telangana Congress : కాంగ్రెస్‌లో కాక.. ఈసారి దిల్లీ చేరిన విభేదాలు

Conflicts in Telangana Congress : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి భగ్గుమన్న వేళ.. సీనియర్‌ నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. ఇప్పటికే పార్టీని కాదని.. ప్రత్యేక సమావేశాలపై అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది. నేతల మధ్య కుమ్ములాటలు కాకుండా.. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి.. సమన్వయంతో సాగేలా దిశానిర్దేశం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Conflicts in Telangana Congress
Conflicts in Telangana Congress

By

Published : Mar 22, 2022, 11:42 AM IST

Conflicts in Telangana Congress : అధికార తెరాసను ఢీకొట్టడమే లక్ష్యంగా ఓ వైపు క్షేత్రస్థాయి పర్యటనలు.. సీనియర్ల అసమ్మతి రాగాలు, ప్రత్యేక భేటీలు.. మరోవైపు. తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని వారే చెబుతుంటారు. మరుసటి రోజు సొంత పార్టీ నేతలకే బహిరంగంగా సవాళ్లు విసురుతుంటారు. ఇలా.. రాష్ట్ర కాంగ్రెస్‌లో నేతల తీరు పార్టీ శ్రేణులను తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి. రాష్ట్రంలో కొత్త పీసీసీ అధ్యక్షుడు, ఇతర కార్యవర్గం ఎన్నికైన మొదట్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించిన కొందరు సీనియర్లు.. క్రమంగా ఏకతాటిపైకి వచ్చి తమ మధ్య ఎలాంటి విభేదాలు లేవని చెబుతూ వచ్చారు. అంతలోనే మళ్లీ నిరసన గళం వినిపించటం ప్రారంభించిన నేతలు.. హోటళ్లలో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేశారు. సీనియర్ నేతల సమావేశాన్ని తీవ్రంగా పరిగణించిన అధిష్ఠానం.. వారికి హెచ్చరికలు జారీచేసింది. ఈ క్రమంలోనే.. కార్యనిర్వహక అధ్యక్షుడు జగ్గారెడ్డికి అప్పగించిన 4 పార్లమెంట్ నియోజకవర్గాల ఇన్ ఛార్జి బాధ్యతల నుంచి పీసీసీ తప్పించింది.

హస్తిన బాట పట్టిన హస్తం నేతలు..

Disputes in Telangana Congress : అసమ్మతి రాగాలు.. అధిష్ఠానం హెచ్చరికల వేళ.. రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన సీనియర్‌ నేతలంతా హస్తిన బాట పడుతున్నారు. ఇప్పటికే పార్లమెంటు సమావేశాల దృష్ట్యా పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. దిల్లీలో ఉండగా.. సీనియర్‌ నేత వీహెచ్ సైతం హస్తినకు వెళ్లారు. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీలో పరిణామాలపై ఓ లేఖను సిద్ధం చేసుకున్న ఆయన.. అధినేత్రి సోనియా గాంధీని కలిసి.. వివరించాలని నిర్ణయించుకున్నారు. అలాగే.. పార్టీ పెద్దలను కలిసేందుకు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు దిల్లీ బయలుదేరారు. పార్టీ వ్యవహారాల బాధ్యుడు మాణిక్కం ఠాగూర్‌తో వీరు భేటీ అయ్యే అవకాశముంది.

పీసీసీపై జగ్గారెడ్డి ఫైర్..

Jaggareddy Fires on PCC : మరోవైపు ఇటీవల రేవంత్‌రెడ్డికి సవాల్‌ విసిరిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఇవాళ మరోసారి మీడియా ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. తనకు అప్పగించిన బాధ్యతలను పూర్తిగా తప్పించడంపై స్పందించటంతో పాటు పీసీసీ అధ్యక్షుడి తీరును ఎండగట్టాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కుసుమ కుమార్‌.. ఆయనతో భేటీ కావటం చర్చనీయంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details