‘‘ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివే విద్యార్థులకు ప్రథమ సంవత్సరం పరీక్షలు(Intermediate Exams) తప్పకుండా నిర్వహిస్తాం.. విద్యార్థులు పరీక్షలకు సన్నద్ధం కావాలి’’ అని ప్రకటించిన ప్రభుత్వం.. పరీక్షల కాలపట్టిక ప్రకటించకుండా నిర్లక్ష్యం వహిస్తోంది. ఫలితంగా దాదాపు 4.74 లక్షల మంది విద్యార్థులు అయోమయ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. కరోనా కారణంగా గత మే నెలలో ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు(Intermediate Exams) నిర్వహించలేదు. రెండో ఏడాది విద్యార్థులకు మొదటి సంవత్సరంలో వచ్చిన మార్కులనే ఇచ్చారు. తొలి ఏడాది విద్యార్థులను రెండో సంవత్సరంలోకి ప్రమోట్ చేస్తున్నామని, పరిస్థితులు అనుకూలిస్తే పరీక్షలు(Intermediate Exams) జరుపుతామని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఏప్రిల్ 15న విద్యాశాఖ ఉత్తర్వులిచ్చింది.
ఈనెల ఒకటో తేదీ నుంచి ప్రత్యక్ష తరగతులు ప్రారంభించిన నేపథ్యంలో ఇంటర్ పరీక్షలు తప్పకుండా ఉంటాయని, త్వరలోనే కాలపట్టిక ఇస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించి 20 రోజులు గడిచింది. కానీ దాని ఊసే లేదు. పరీక్షల ప్రారంభానికి 15 రోజులు ముందుగా కాలపట్టికను ప్రకటించాలి. ప్రభుత్వం పునరాలోచనలో పడటం వల్లే కాలపట్టిక ఇవ్వలేదని విశ్వసనీయ సమాచారం. ముమ్మరంగా ప్రత్యక్ష తరగతులు జరుగుతున్నందున, ఇప్పుడు పరీక్షలు జరిపితే రెండో ఏడాది తరగతులకు నష్టం జరుగుతుందని, అందుకే పరీక్షలకు ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో ఉన్నట్లు తెలిసింది.
పరీక్షలు జరిపితే సమస్యలు ఇవీ