తెలంగాణ

telangana

ETV Bharat / city

మే 5 నుంచి ఇంటర్​ పరీక్షలు - ఏపీలో మే 5 నుంచి ఇంటర్ పరీక్షలు వార్తలు

ఆంధ్రప్రదేశ్​లో మే 5 నుంచి ఇంటర్​ పరీక్షలు జరగనున్నాయి. . కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలని ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్​ తెలిపారు.

ap inter exams
ap inter exams

By

Published : Apr 28, 2021, 6:27 PM IST

ఇంటర్ పరీక్షలపై ఆంధ్రప్రదేశ్​ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ వర్చువల్‌ సమీక్ష జరిపారు. జేసీలు, ఆర్ఐవో, డీఈవోలతో మాట్లాడిన ఆయన..షెడ్యూల్ ప్రకారం వచ్చే నెల 5 నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. కొవిడ్ జాగ్రత్తలు తీసుకుని పరీక్షలకు సిద్ధం కావాలన్నారు. ఇంటర్‌ పరీక్షలు అనివార్యమని అందరూ గుర్తించాలని తెలిపారు. ఏ రాష్ట్రంలోనూ ఇంటర్ పరీక్షలు రద్దు కాలేదని గుర్తు చేశారు. ఇంటర్ ప్రాక్టికల్స్ పూర్తి చేసిన అధికారులకు మంత్రి సురేష్.. అభినందనలు తెలిపారు. ఇంటర్ పరీక్షలు కూడా విజయవంతంగా పూర్తి చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details