తెలంగాణ

telangana

ETV Bharat / city

పార్టీ కార్యకలాపాలపై కాంగ్రెస్​ సీనియర్ల ఆసక్తికర వ్యాఖ్యలు.. - Congress seniors Interesting Comments

హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు.. ప్రత్యేకంగా సమావేశమయ్యారు. రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీ స్థితిగతులు, తెరాస, భాజపాలను దీటుగా ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలన్నఅంశాలపై చర్చించారు.

Interesting Comments by Congress seniors on party activities
Interesting Comments by Congress seniors on party activities

By

Published : Feb 28, 2022, 5:47 AM IST

రాష్ట్రంలో పార్టీ కార్యకలాపాలు మరింత వేగవంతం చేయాల్సి ఉందని కాంగ్రెస్‌ సీనియర్లు అభిప్రాయపడ్డారు. ఇప్పుడున్న వేగం ఏ మాత్రం సరిపోదని...మాజీ మంత్రులు జానారెడ్డి, పొన్నాల లక్ష్మయ్యలతో పాటు పలువురు సీనియర్లు స్పష్టం చేశారు. హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని మాజీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య నివాసంలో పలువురు కాంగ్రెస్‌ సీనియర్లు.. ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

రాష్ట్రంలో తాజా రాజకీయాలు, పార్టీ స్థితిగతులు, తెరాస, భాజపాలను దీటుగా ఎదుర్కొని ఎలా ముందుకు వెళ్లాలన్నఅంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో పాల్గొన్న జగ్గారెడ్డికి సీనియర్లు.. సర్ది చెప్పారు. పార్టీలోనే ఉండి.. అన్యాయాలపై మాట్లాడాలని సూచించారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు వెళ్లితేనే.. పార్టీని గాడిలో పెట్టేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. తరచూ సీనియర్లందరూ సమావేశమై...పార్టీ కార్యకలాపాలపై చర్చించుకోవాలని నిర్ణయించారు. పార్టీ అంతర్గత విషయాలతోపాటు , రాష్ట్రంలోని తాజా రాజకీయాలపై చర్చించి.. పీసీసీకి తగిన సలహాలు, సూచనలు చేయాలని అంగీకారానికి వచ్చారు.

ఇదీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details