amaravathi farmers: ఉన్న భూమిని రాజధానికి ఇచ్చేశారు. పరిహారంగా వచ్చిన ప్లాట్ ఎక్కడుందో తెలియదు. దాన్ని ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పదు. మీ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోండంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. రకరకాల వివాదాలున్నా.. వాటినీ పరిష్కరించడం లేదు. ఒకసారి ప్లాట్లు చూసుకుందామని వెళ్తే ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. ఏపీలోని అమరావతిలో రైతులకు కేటాయించిన ప్లాట్ల వద్ద ప్రస్తుత పరిస్థితి, రైతుల అభ్యంతరాలను ఈటీవీ భారత్ ప్రతినిధి వివరిస్తారు.
'కోర్టు తీర్పుతో సంబురపడాలో.. సర్కారు తీరుతో ఏడవాలో..'
amaravathi farmers: హైకోర్టు తీర్పు అనుకూలంగా వచ్చిందని సంబురపడాలో.. సర్కారు తీరుతో ఏడవాలో తెలియక ఏపీలో రాజధాని రైతులు ఆందోళన చెందుతున్నారు. కేటాయించిన ప్లాట్లను చూసుకుందామని వెళ్తే.. ఆ ప్రాంతం అడవిని తలపిస్తోంది. ఎప్పుడు అభివృద్ధి చేస్తారో ప్రభుత్వం చెప్పలేదు కానీ.. ప్లాట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటూ సీఆర్డీఏ అధికారులు నోటీసులు ఇస్తున్నారు. మేము ఏం పాపం చేశామని రైతులు కన్నీటిపర్యంతమవుతున్నారు.
'కోర్టు తీర్పుతో సంబరపడాలో.. సర్కారు తీరుతో ఏడవాలో.. తెలియని స్థితిలో రాజధాని రైతులు'