తెలంగాణ

telangana

ETV Bharat / city

EAPCET: జులైలో ఈఏపీసెట్‌... ఇంటర్‌ వెయిటేజీ తొలగింపు - EAPset

Inter weightage: ఈఏపీసెట్‌లో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ వెయిటేజీ తొలగించనున్నారు. మొదటి ఏడాది రెగ్యులర్‌ పరీక్షలు నిర్వహించనందున వెయిటేజీ తొలగించాలని అధికారులు నిర్ణయించారు.ఈఏపీసెట్‌ను మే నెలలో నిర్వహించనున్నారు.

inter students
ఇంటర్ విద్యార్థులు

By

Published : Apr 12, 2022, 12:18 PM IST

Updated : Apr 12, 2022, 12:27 PM IST

Inter weightage: ఏపీలో ఇంజినీరింగ్‌, వ్యవసాయం, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈఏపీసెట్‌లో ఈ ఏడాది ఇంటర్మీడియట్‌ వెయిటేజీ తొలగించనున్నారు. కరోనా కారణంగా ఇంటర్‌ పరీక్షలు నిర్వహించనందున గతేడాది వెయిటేజీ తొలగించారు. ప్రస్తుతం రెండో ఏడాది చదువుతున్న విద్యార్థులందర్నీ ప్రథమ సంవత్సరంలో ఉత్తీర్ణులు చేశారు. అప్పుడు కేవలం ఉత్తీర్ణత మార్కులనే కేటాయించారు. మొదటి ఏడాది రెగ్యులర్‌ పరీక్షలు నిర్వహించనందున వెయిటేజీ తొలగించాలని అధికారులు నిర్ణయించారు.

ఇంజినీరింగ్‌, వ్యవసాయ, పార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష(ఈఏపీసెట్‌)ను జులై 4వ తేదీ నుంచి నిర్వహించనున్నారు. జులై 4 నుంచి 8వ తేదీ వరకు ఇంజినీరింగ్‌ పరీక్ష, జులై 11, 12 తేదీల్లో అగ్రికల్చర్ పరీక్ష నిర్వహిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఏప్రిల్‌ 11న నోటిఫికేషన్‌ విడుదల చేస్తామన్నారు. ఈ ఏడాది ఈఏపీసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ అనంతపురానికి అప్పగించారు. సెట్‌ కన్వీనర్‌గా విజయకుమార్‌ను నియమించారు. రాష్ట్ర విభజన తర్వాత నుంచి జేఎన్‌టీయూ, కాకినాడ ఈఏపీసెట్‌ నిర్వహిస్తూ వస్తుండగా.. ఈసారి మార్పు చేశారు.

ఇదీ చదవండి:అందుకు ఇంటర్‌లో పాసైతే చాలు..

Last Updated : Apr 12, 2022, 12:27 PM IST

ABOUT THE AUTHOR

...view details