సొంత ఊళ్లో పెద్దమనుషులు.. పక్క రాష్ట్రాల్లో దొంగలు!
స్వగ్రామాల్లో వారో వ్యాపారస్థులు. అందరికీ ఆదర్శంగా ఉండే పెద్ద మనుషులు! కానీ పక్క రాష్ట్రాల్లో మాత్రం దొంగలు. అదేంటీ అనుకుంటున్నారా... అసలేం జరిగిందంటే...
దక్షిణ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో చోరీకి పాల్పడిన అంతర్రాష్ట్ర ముఠాను మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు, మధ్యప్రదేశ్‌లో ఈ నిందితులు దొంగతనాలకు పాల్పడినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. వారి నుంచి 60తులాల బంగారు, 2కిలోల వెండి ఆభరణాలు, ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు యూపీ, ఉత్తరాఖండ్‌లోని వారి సొంత గ్రామాల్లో వ్యాపారం నిర్వహిస్తూ పెద్ద మనుషులుగా చలామణి అవుతున్నారని సీపీ తెలిపారు. సంవత్సరంలో ఓ నెలరోజులు మాత్రం ఇతర రాష్ట్రాలకు వెళ్లి చోరీలు చేస్తారని పేర్కొన్నారు.
- ఇదీ చూడండి : పోలీసుల శ్రమ ఫలించింది... రోడ్డు ప్రమాదాలు తగ్గాయి!