ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. ఇప్పటికే కనీస మార్కులతో విద్యార్థులను ప్రభుత్వం ఉత్తీర్ణులను చేసినప్పటికీ మార్కుల శాతాన్ని పెంచుకునేందుకు మరో అవకాశం ఇచ్చింది. బెటర్‌మెంట్ రాసి ఎక్కువ మార్కులు సాధించుకునే వెసులుబాటు కల్పించింది. ఈ నెల 15 నుంచి 23వ తేదీ వరకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రథమ సంవత్సర విద్యార్థులు, మధ్నాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ప్రశ్నపత్రాలను పోలీస్ స్టేషన్లలో భద్రపరిచారు. పరీక్ష కేంద్రాల్లో ఎటువంటి అసౌకర్యాలు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేశారు. మాస్ కాపీయింగ్ జరగకుండా సీసీ కెమెరాల నిఘా పెట్టారు. పరీక్షల నిర్వహణకు ప్రత్యేకాధికారులను నియమించారు. విద్యార్థులకు నిత్యం మంచి నీరు, వైద్య సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నారు.
కొవిడ్ దృష్ట్యా..
అభ్యర్థులు ఉదయం 8.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రశ్నాపత్రాలను తరలించేందుకు ప్రత్యేక వాహనాలను సిద్ధం చేశారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బల్లలు ఏర్పాటు చేశారు. కేంద్రంలోకి విద్యార్థులు వెళ్లేటప్పుడు తనిఖీలు నిర్వహించనున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పరీక్ష కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు అధికారులు వెల్లడించారు. కొవిడ్ దృష్ట్యా అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ప్రతి పరీక్ష కేంద్రంలో ఒక ఐసొలేషన్ గది ఏర్పాటు చేశారు. కొవిడ్ అనుమానిత లక్షణాలున్న వారు ఆ గదిలో పరీక్ష రాసేలా చర్యలు తీసుకుంటారు. కేంద్రాలను శానిటైజ్ చేస్తున్నారు. థర్మల్ స్కానింగ్ అనంతరం పరీక్ష రాసేందుకు అనుమతిస్తారు. పీపీ కిట్లు అందుబాటులో ఉంచారు.
జిల్లాలో మొత్తం కేంద్రాలు 142
ప్రథమ సంవత్సర విద్యార్థులు 54,326