ఏపీలో ఇంటర్ పరీక్షలు వాయిదా.. కొత్త తేదీలు ఇవే.. - Inter Exams in AP postponed
13:11 March 03
AP Inter Exams Postponed 2022: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు కొత్త పరీక్షల తేదీలను వెలువరించింది. ఏప్రిల్ 22 నుంచి పరీక్షలు మొదలై.. మే 12 వరకు జరుగుతాయి. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి ప్రారంభమై 28వ తేదీతో పూర్తవ్వాలి. కానీ జేఈఈ మెయిన్ ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ పరీక్షలను వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మరోవైపు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలను గతంలో ప్రకటించిన తేదీల్లోనే(మార్చి 11 నుంచి మార్చి 31) జరుగుతాయని ఏపీ విద్యాశాఖ మంత్రి సురేశ్ తెలిపారు. కొవిడ్ నిబంధనల మేరకే పరీక్షలు నిర్వహిస్తామన్నారు. దీనికి సంబంధించి బోర్డు తరపున అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు చెప్పారు. 1,400 పరీక్షా కేంద్రాలు, 900 ల్యాబ్‌లను సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. ఇన్విజిలేషన్‌కు సిబ్బంది సమస్య లేదని ఆయన చెప్పారు. పది, ఇంటర్ పరీక్షల నిర్వహణకు పరీక్షా కేంద్రాల ఏర్పాట్లలో ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి సురేశ్ తెలిపారు.