విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు - Inter Board finalizing the academic year in Telangana
విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు
By
Published : Sep 10, 2020, 5:33 PM IST
|
Updated : Sep 10, 2020, 7:11 PM IST
17:29 September 10
విద్యా సంవత్సరం ఖరారు చేసిన ఇంటర్ బోర్డు
కరోనా పరిస్థితులతో విద్యా సంవత్సరాన్ని 182రోజులకు కుదిస్తూ ఇంటర్ బోర్డు షెడ్యూల్ ఖరారు చేసింది. మార్చి 24నుంచి వార్షిక పరీక్షలు మొదలు కానున్నాయి. ఏప్రిల్ 17 నుంచి వేసవి సెలవులు ఇచ్చి జూన్ ఒకటిన తిరిగి కళాశాలలు ప్రారంభించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది దసరాకు మూడు రోజులు, సంక్రాంతి రెండు రోజులు మాత్రమే సెలవులు ఇచ్చారు.
తగ్గిన సెలవులు
కరోనా పరిస్థితులతో గందరగోళంగా మారిన విద్యా సంవత్సరాన్ని పునరుద్దరించేందుకు బోర్డు చర్యలు చేపట్టింది. సెలవులను భారీగా తగ్గిస్తూ విద్యా సంవత్సరాన్ని ఖరారు చేసింది. పని దినాలను తగ్గించిన అధికారులు ఈ విద్యా సంవత్సరంలో 220 రోజులకు బదులు 182రోజుల్లోనే సిలబస్ పూర్తి చేయాలని నిర్ణయించారు. దసరాకు ఆదివారంతో కలిసి మూడు రోజులే సెలవులు. సంక్రాంతికి రెండు రోజులేనని బోర్డు స్పష్టం చేసింది.
ఫిబ్రవరి 22 నుంచి 27వరకు ఇంటర్ ఫ్రీ ఫైనల్ పరీక్షలు...మార్చి ఒకటి నుంచి మార్చి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలని వెల్లడించింది. మార్చి 24 నుంచి ఏప్రిల్ 12వ తేదీ వరకు వార్షిక పరీక్షలు ఉంటాయని బోర్డు వివరించింది. ఏప్రిల్ 17నుంచి మే 13 వరకు వేసవి సెలవులుగా పేర్కొంది. మే చివరి వారంలో అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. అనంతరం జూన్ ఒకటిన తిరిగి కళాశాలను ప్రారంభించనున్నట్లు బోర్డు వెల్లడించింది. కరోనా పరిస్థితులతో విద్యా సంవత్సరంలో 38 పని దినాలు తగ్గించింది.