సంస్కృతంపై ఆదేశాలేమీ ఇవ్వలేదు: ఇంటర్ బోర్డు - telangana varthalu
16:49 July 10
ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ద్వితీయ భాషగా సంస్కృతంపై ఇంటర్ బోర్డు వివరణ
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రవేశ పెట్టాలని ఆదేశించలేదని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పేర్కొన్నారు. సంస్కృతాన్ని ద్వితీయ భాషగా ప్రవేశపెట్టేందుకు అవసరమైన డిమాండ్ ఉందా తెలపాలని మాత్రమే ప్రిన్సిపాళ్లను కోరినట్లు జలీల్ తెలిపారు. తెలంగాణ సంస్కృత అధ్యాపకుల సంఘం, తెలంగాణ సంస్కృత రీసెర్చి స్కాలర్స్, విద్యా సంఘాలు ఎమ్మెల్సీ కవితను కోరగా... పరిశీలించాలని ఆమె తమకు వినతిపత్రాన్ని పంపించారని వివరించారు.
ఈ నేపథ్యంలో సంస్కృతం ద్వితీయ భాషగా ప్రవేశ పెట్టేందుకు డిమాండ్ ఉందా గుర్తించాలని ప్రిన్సిపాళ్లను కోరుతూ మెమో జారీ చేసినట్లు జలీల్ తెలిపారు. ఏ భాషనైనా ద్వితీయ భాషగా ప్రవేశ పెట్టేముందు అవసరమైన ప్రక్రియ చేపట్టి బోర్డు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు.
ఇదీ చదవండి: Venkaiah: 'కరోనాను జయించాలంటే పంచసూత్ర ప్రణాళిక పాటించాల్సిందే'