Inter Exams: ఇంటర్ స్టూడెంట్స్ అలర్ట్.. వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. - Intermediate exams schedule
21:06 March 02
ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో మార్పులు.. రెండు రోజులు ఆలస్యంగా..
Inter Exams: జేఈఈ మెయిన్ కారణంగా ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూలులో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. ఏప్రిల్ 20న ప్రారంభం కావాల్సిన పరీక్షలు.. 22 నుంచి ప్రారంభించాలని ఇంటర్ బోర్డు నిర్ణయించింది. మొదటి సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 22 నుంచి మే 11 వరకు జరగనున్నాయి.
రెండో సంవత్సరం పరీక్షలు ఏప్రిల్ 23 నుంచి మే 12 వరకు నిర్వహించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఓమర్ జలీల్ వెల్లడించారు. ఏప్రిల్ 16 నుంచి 21 వరకు జేఈఈ మెయిన్ పరీక్షలు నిర్వహిచేందుకు ఎన్టీఏ నిర్ణయించడం వల్ల.. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను బోర్డు సవరించింది. ఈ మార్పులను ఇంటర్ విద్యార్థులు గమనించాలని కోరింది.
ఇదీ చూడండి: