అడ్వాన్స్ సప్లిమెంటరీ షెడ్యూలు విడుదల అడ్వాన్స్ సప్లిమెంటరీ షెడ్యూలును ఇంటర్ బోర్డు విడుదల చేసింది. మే 16 నుంచి 27 వరకు సప్లిమెంటరీ పరీక్షలు జరగనున్నాయి. మే 28 నుంచి 31 వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. జూన్ 1న నైతిక మానవ విలువ పరీక్ష, 3న పర్యావరణం, విద్య పరీక్షలు జరగనున్నాయి.
తప్పులపై వివరణ
మార్కుల జాబితాలో తప్పులపై ఇంటర్మీడియట్ బోర్డు వివరణ ఇచ్చింది. చీఫ్ సూపరింటెండెంట్‌ల తప్పిదం వల్ల మూడు మెమోల్లో తప్పులు దొర్లినట్లు బోర్డు స్పష్టం చేసింది. తప్పులు జరిగిన ముగ్గురు విద్యార్థుల మార్కుల జాబితాను సవరిస్తామని తెలిపింది. ఫలితాలపై సమాచారం, సందేహాల నివృత్తి కోసం హెల్ప్‌లైన్ నెంబర్ 040-24600110 ఏర్పాటు చేసింది.
ఇవీ చూడండి: రెవెన్యూ వ్యవస్థను కేసీఆర్ చిన్నాభిన్నం చేశారు